కొన్ని క్యాసినో(జూదం ఆడే చోటు)ల్లో తన మార్ఫింగ్ ఫొటోలు వాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకుంటా అని టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అన్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి క్యాసినోలకు వాడుకోవడంపై సచిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై త్వరలోనే లీగల్‌గా చర్యలు తీసుకుంటా అని హెచ్చరించారు. క్రికెట్‌లో, బయట వివాదాలకు దూరంగా ఉండే సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని మాత్రం చాలా సిరీస్‌గా తీసుకున్నారు.
కాగా ప్రముఖ ఫొటోలను మార్ఫింగ్ చేసి, అనుమతి లేకుండా ఇలా ప్రజలకు నష్టం చేసే కార్యక్రమాలకు వాడడం సర్వసాధారణం అయిపోయింది. కానీ వీటికి పుల్‌స్టాప్ పెట్టాలని సచిన్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో క్యాసినో నిర్వహిస్తూ.. తన మార్ఫింగ్ ఫొటోలు వాడి తన అభిమానులను ఆకర్షించడంపై టెండూల్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టికి వచ్చిన క్యాసినోలపై చట్టపరమైన చర్యలు తప్పవని సచిన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపారు. గ్యాంబ్లిగ్, పొగగాకు, మద్యాన్ని తానేప్పుడు ప్రొత్సహించలేదని సచిన్ స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Cricket legend #SachinTendulkar (@sachin_rt) has expressed shock over his allegedly morphed images being used to endorse a casino and said he will soon be taking legal action against the misuse of his image. pic.twitter.com/CNhGHxWfcS
— IANS Tweets (@ians_india) February 24, 2022
Requesting everyone to remain vigilant about misleading images on social media. pic.twitter.com/VCJfdyJome
— Sachin Tendulkar (@sachin_rt) February 24, 2022