ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 మంచి రసవత్తరంగా సాగుతోంది. ఇంకా ప్రధాన పోటీలైన సూపర్ 12 ప్రారంభం కాకముందే.. టోర్నీకి బీభత్సమైన హైప్ వచ్చేసింది. అందుకు కారణం గ్రూప్ స్టేజ్‌లోనే సంచలనాలు నమోదు కావడం. ఆసియా కప్ 2022లో టీమిండియా, పాకిస్థాన్ లాంటి పటిష్టమైన జట్లను ఓడగొట్టి ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంక.. పసికూన నమీబియా చేతిలో చిత్తుగా ఓడింది. అలాగే.. రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెస్టిండీస్ టీమ్.. స్కౌట్లాండ్ చేతిలో దారుణంగా ఓడింది. మెగా టోర్నీల్లో పసికూనలు పెద్ద టీమ్స్‌కు షాక్ ఇవ్వడం కామనే అయినా.. టోర్నీ ఆరంభంలోనే రెండు పెద్ద జట్ల ఓడిపోవడంతో టోర్నీకి కావాల్సినంత జోష్ వచ్చింది. అలాగే వామప్ మ్యాచ్‌లో ఆసీస్‌ను భారత్ ఓడించి.. మంచి కాన్ఫిడెన్స్‌ను దక్కించుకుంది.
ఇలా పెద్ద పెద్ద జట్లకు షాక్‌లు తగులుతున్న ఈ తరుణంలో ఇంకా.. సూపర్ 12 పోటీలు ఆరంభం కాకముందే.. మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు వరల్డ్ కప్ ఫైనల్, సెమీ ఫైనల్ ఆడే జట్లు ఇవే అంటూ తేల్చిపడేస్తున్నారు. స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతున్నందున ఆస్ట్రేలియాకు మంచి అడ్వాంటేజ్ ఉంటుందని.. ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్ జట్లు వరల్డ్ కప్ ఫైనల్ ఆడే అవకాశం ఉందని వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఇప్పటికే ప్రకటించాడు. అలాగే.. కొంచెం కష్టపడితే పాకిస్థాన్‌కు సైతం అవకాశాలు ఉన్నట్లు యునివర్సల్ బాస్ పేర్కొన్నాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం.. వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరే జట్లపై తన అంచనాను వెల్లడించాడు.
ప్రస్తుతం ఆయా టీమ్స్‌లోని ఆటగాళ్లను, వారి ఫామ్‌ను బట్టి అలాగే ఆస్ట్రేలియా పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న జట్లను సచిన్ టాప్ 4 టీమ్స్‌గా ఎంపిక చేశాడు. ఆ టీమ్సే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీ ఫైనల్స్ ఆడుతాయని అన్నాడు. ఆ నాలుగు టీమ్స్ ఏవంటే… ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్. ఈ నాలుగు జట్లు వరల్డ్ కప్ సెమీస్‌కు చేరుతాయని మాస్టర్ బ్లాస్టర్ అభిప్రాయపడ్డారు. కాగా.. సచిన్ అంచనాకు చాలా మంది క్రికెట్ అభిమానులు సముఖత వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇవే జట్లు సెమీస్ ఆడతాయని తాము కూడా అనుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా సచిన్ అంచనాతో ఏకీభవిస్తున్నారు. అలాగే ఈ ఆదివారం భారత్-పాక్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధిస్తుందని సచిన్ ధీమా వ్యక్తం చేశారు.
Sachin Tendulkar predicts India Pakistan England and Australia will be semi finalist in T20 World Cup 2022 https://t.co/QnZH3XWLaB
— HuntdailyNews (@HUNTDAILYNEWS1) October 18, 2022