మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరుకు క్రికెట్ లో స్పెషల్ హిస్టరీ ఉంది. సక్సెస్ ఫుల్ కెప్టెన్, వికెట్ కీపర్, ఫినిషర్.. వాట్ నాట్ హీ ఈజ్ ఎవ్రిథింగ్ అని ప్రూవ్ చేశాడు. మూడేళ్ల క్రితమే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. అలాంటి ధోనీ పేరు సడన్ గా మరోసారి మార్మోగిపోయింది. దానికి కారణం రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్. అదేంటి రోహిత్ ఆడితే ధోనీ గురించి మాట్లాడుకుంటున్నారు అని మీకు డౌట్ వచ్చిందా? అయితే మీరు ఇది కచ్చితంగా చదివి తీరాల్సిందే. అప్పుడు మీరే ఒప్పుకొంటారు కూడా.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తాజాగా టీమిండియా-బంగ్లాదేశ్ రెండో వన్డే జరిగింది. ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో భారత్ ఓడిపోయింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అభిమానుల మనసు గెలిచేశాడు. ఎందుకంటే ఫీల్డింగ్ చేస్తున్న టైంలో గాయపడిన హిట్ మ్యాన్.. అసలు బ్యాటింగ్ కే రాడని అందరూ ఫిక్సయిపోయారు. అలాంటిది ఈ మ్యాచ్ లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. 28 బంతుల్లో 51 పరుగులు చేసి అదరగొట్టాడు. రోహిత్ ఊపు చూస్తే మ్యాచ్ ని గెలిపించేస్తాడనిపించింది. కానీ అది జరగలేదు. కానీ సోషల్ మీడియాలో సరికొత్త వాదన తెరపైకి వచ్చింది.
టీమిండియా బ్యాటింగ్ పరంగా చాలా బలంగా ఉంది. బౌలింగ్ బెంచ్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాల్సి ఉంది. వచ్చిన సమస్యల్లా కూడా ఆల్ రౌండర్ దగ్గరే వస్తోంది. హార్దిక్, జడేజా లాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. పినిషర్ గా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో తప్పించి.. బ్యాటుకు పనిచెప్పట్లేదు. ఇక ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతడి ప్లేస్ భర్తీ చేసే పినిషర్ ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు. సరిగ్గా ఇలాంటి టైంలో రోహిత్.. చివర్లో వచ్చిన బ్యాట్ తో అదరగొట్టాడు. దీంతో అతడు పినిషర్ గా రావాలని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. బంగ్లాతో మ్యాచ్ లో బ్యాటింగ్ స్టైల్ చూసి ధోనీతో పోల్చుతున్నారు. ప్రస్తుతం జట్టులో ఉన్న రాహుల్ ని ఓపెనర్ గా పంపించి, రోహిత్ లోయర్ ఆర్డర్ లో పినిషిర్ గా వస్తే చూడాలని ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం టీమిండియా మరింత బలంగా తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Hail #RohitSharma for his commitment. pic.twitter.com/z8Rxaq710g
— Shubhankar Mishra (@shubhankrmishra) December 7, 2022