శ్రీలంకతో టెస్టు సిరీస్ కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. అంతేకాకుండా టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే టెస్టు జట్టుకు కూడా రోహిత్ శర్మను కెప్టెన్ చేసింది. బీసీసీఐ ఎప్పుడూ అనుసరించే తీరులోనే.. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ను నియమించింది. ఇది విరాట్ కోహ్లీకి బిగ్ షాక్ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆటగాడిగా తనని తాను నిరూపించుకునేందుకు కోహ్లీకి ఇది గొప్ప అవకాశం అంటూ చెబుతున్నారు.
రోహిత్ శర్మ(కెప్టెన్), ప్రియాంక్ పాంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్(కీపర్), కేఎస్ భరత్, జడేజా, జయంత్ యాదవ్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, షమీ, జాస్ప్రిత్ బుమ్రా(వైస్ కెప్టెన్).
Test squad – Rohit Sharma (C), Priyank Panchal, Mayank Agarwal, Virat Kohli, Shreyas Iyer, Hanuma Vihari, Shubhman Gill, Rishabh Pant (wk), KS Bharath, R Jadeja, Jayant Yadav, R Ashwin, Kuldeep Yadav, Sourabh Kumar, Mohd. Siraj, Umesh Yadav, Mohd. Shami, Jasprit Bumrah (VC).
— BCCI (@BCCI) February 19, 2022
మరోవైపు శ్రీలకంతో టీ20 సిరీస్ కు కూడా జట్టును ప్రకటించారు. టీ20 సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, పంత్ కు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే.
టీ20 స్క్వాడ్:
రోహిత్ శర్మ(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, దీపక్ హుడా, జడేజా, చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జాస్ప్రిత్ బుమ్రా(వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్.