భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. తన స్వస్థలం ఉత్తరాఖంఢ్ నుంచి ఢిల్లీకి వస్తుండగా.. శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో.. పంత్ కారు ప్రమాదానికి గురయ్యింది. హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలోని రూర్కీలోని నర్సన్ సరిహద్దులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం పంత్ నుదుటిపైన, కాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ దేహత్ స్వప్న కిషోర్ సింగ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం రిషబ్ పంత్ పరిస్థితి నిలకడగా ఉందని, అతన్ని రూర్కీ నుంచి ఢిల్లీకి రిఫర్ చేస్తున్నట్లు సక్షమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ తెలిపారు.
ఇక ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషబ్ ప్రయాణిస్తున్న కారు రైలింగ్‌ను ఢీకొని మంటలు అంటుకున్నాయి. అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. అదే సమయంలో, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రిషబ్ పంత్.. తన స్వస్థలం ఉత్తరాఖంఢ్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో.. రిషబ్ పంతే.. తన మెర్సిడెస్ కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. కారు డివైడర్‌ను గుద్దుకోగానే మంటలు చెలరేగాయి. ఇది గమనించిన వెంటనే రిషబ్.. కారు విండో పగలగొట్టుకుని బయటకు దూకేశాడని స్థానిక మీడియా పేర్కొంటుంది. ఈ క్రమంలో పంత్ వీపుకు కూడా మంటలు అంటుకున్నాయని.. అతడు బయటకు దూకే క్రమంలో.. తల, మోకాలుకి గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పంత్.. ఆడాడు. ఇక త్వరలో జరగబోయే శ్రీలంక టీ20 సిరీస్‌కు పంత్‌ను ఎంపిక చేయలేదు. ఇక క్రిస్మస్ సందర్భంగా పంత్.. మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sad incident, Rishabh Pant bhai get well soon pic.twitter.com/z2EWTbK8ig
— DJay (@djaywalebabu) December 30, 2022
Cricketer #RishabhPant seriously injured in a car accident on the Delhi-Roorkee highway.
He was immediately rushed to AIIMS Rishikesh.
Abhishek Sinha shares latest details with @prathibhatweets. pic.twitter.com/C4CXQJzVTo
— TIMES NOW (@TimesNow) December 30, 2022