టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై జింబాబ్వే ఘన విజయం సాధించడంతో.. జింబాబ్వే టీమ్ కి ఆ దేశ అధ్యక్షుడు అభినందనలు తెలియజేశారు. అయితే ట్విట్టర్ వేదికగా తమ దేశ జట్టుపై ప్రశంసలు కురిపించడమే కాకుండా.. పాకిస్తాన్ పై పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. ‘జింబాబ్వేకి ఎంతటి విజయం దక్కింది. అభినందనలు చెవ్రాన్స్’ అంటూ.. దాని కింద ‘ఈసారి నిజమైన మిస్టర్ బీన్ ని పంపించండి’ అంటూ జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మెర్సన్ డంబూడ్జో మ్నంగాగ్వా పాకిస్తాన్ కి పరోక్షంగా చురకలు అంటించారు. ఈ కామెంట్స్ ని జింబాబ్వేతో పాటు పాక్ అంటే గిట్టని వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
దీనికి కారణం గతంలో జింబాబ్వే దేశాన్ని పాకిస్తాన్ అవమానించడమే. 2016లో హరారే ఇంటర్నేషనల్ కాన్ఫిరెన్స్ సెంటర్ లో జింబాబ్వే దేశస్తులు ఒక కామెడీ షో నిర్వహించారు. ఈ షో కోసం మిస్టర్ బీన్ అలియాస్ రొవాన్ అట్కిన్సన్ ను పంపుతున్నామని చెప్పి.. మిస్టర్ బీన్ ని పోలి ఉండే పాక్ కమెడియన్ ఆసీఫ్ మహ్మద్ ను పంపించారు. ఆ సమయంలో మిస్టర్ బీన్ కి ఉన్న ఫాలోయింగ్ కి, అతనే మిస్టర్ బీన్ అనుకుని జింబాబ్వే దేశస్తులు ఫోటోల కోసం ఎగబడ్డారు. ఆ తర్వాత అతను రియల్ మిస్టర్ బీన్ కాదని తెలిసి కంగుతిన్నారు. అప్పటి నుంచి పాకిస్తాన్ పై ప్రతీకారంతో ఉన్న జింబాబ్వేకి ఇన్నాళ్ళకి అవకాశం వచ్చింది. దీంతో జింబాబ్వే దేశ అధ్యక్షుడు ఇలా ట్వీట్ చేశారు.
What a win for Zimbabwe! Congratulations to the Chevrons.
Next time, send the real Mr Bean…#PakvsZim 🇿🇼
— President of Zimbabwe (@edmnangagwa) October 27, 2022
జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిస్టర్ బీన్ కి, జింబాబ్వే, పాకిస్తాన్ దేశానికి సంబంధం ఏమిటని తెలియని వాళ్ళు గూగుల్ లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. అది పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి వెళ్లడంతో స్పందించారు. ‘మాకు నిజమైన మిస్టర్ బీన్ లేకపోవచ్చు. కానీ మాకు నిజమైన క్రికెట్ స్ఫూర్తి ఉంది. మాకు పడి లేచే ఫన్నీ అలవాటు ఉంది. మిస్టర్ ప్రెసిడెంట్ అభినందనలు. మీ టీమ్ చాలా బాగా ఆడింది’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. జింబాబ్వే చేతిలో ఓడిపోయినందుకు పాక్ కి మండుతున్నట్టు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చేసిన సిగ్గుమాలిన పనికి ఇప్పుడు జింబాబ్వే ప్రతీకారం తీర్చుకోవడంపై సీరియస్ గా స్పందిస్తే ఇంకా పరువు పోతుందని ఇలా సాఫ్ట్ కామెంట్స్ చేశారు పాక్ ప్రధాని. అయినా కూడా అవి మిస్ ఫైర్ అయ్యాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
We may not have the real Mr Bean, but we have real cricketing spirit .. and we Pakistanis have a funny habit of bouncing back 🙂
Mr President: Congratulations. Your team played really well today. 👏 https://t.co/oKhzEvU972
— Shehbaz Sharif (@CMShehbaz) October 27, 2022