ఆసియా కప్-2022లో భాగంగా ఆదివారం జరిగిన భారత్- పాక్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠరేపిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ టీ20లో ఉండే అసలైన మాజాను మళ్లీ రుచి చూపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన దాయాదుల పోరు అంత రసవత్తరంగా సాగడంతో క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో పరాభవానికి భారత్ బదులుతీర్చుకుంది.
ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో మొదటి నుంచి డామినేషన్ చూపించిన భారత పేసర్లు.. కేవలం 147 పరుగులకే పాక్‌ను ఆలౌట్ చేశారు. ఛేజింగ్లో భారత్ కాస్త తడబడినట్లు కనిపించినా.. రెండు బాల్లు మిగిలుండగానే విజయం నమోదు చేశారు. అయితే ఈ మ్యాచ్‌పై అర్ఫా ఫిరోజ్ అనే పాక్ జర్నలిస్ట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
పాకిస్తాన్ భారత్ కేవలం లక్ వల్లే గెలిచిందంట. నిజానికి ఆ మ్యాచ్‌లో పాకిస్తానే ఎంతో బెటర్ పర్ఫార్మెన్స్ చేసిదంట. అయితే ఆ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలకు ఎలాగు టీమిండియా అభిమానులు చురకలు అంటిస్తారు అది తెలిసిన విషయమే. అయితే పాక్ పౌరులు సైతం అతనికి కౌంటర్లు వేయడం నెట్టింట ఆసక్తికరంగా మారింది. అతని వ్యాఖ్యలు వస్తున్న కౌంటర్లు వైరల్ అయ్యాయి.
Luck played better cricket than India because India would have never won the match against Pakistan if luck had not favoured India. Hence Pakistan played better cricket than India today! #INDvPAK
— Arfa Feroz Zake (@ArfaSays_) August 28, 2022
అతను ఏమన్నాడంటే.. “భారత్ కంటే వాళ్ల లక్కే ఈరోజు బాగా క్రికెట్ ఆడింది. లక్ లేకపోతే అసలు పాక్‌పై ఎప్పుడూ భారత్ విజయం సాధించలేదు. అయినా ఈరోజు భారత్ కంటే పాక్ ఎంతో బాగా పర్ఫార్మ్ చేసింది” అంటూ పాక్ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు సొంత దేశస్తుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని అతను ఆ సమయంలో ఊహించి ఉండడు.
And now I’m going to block you first
You really need to skip this sport Journalism Profession and try in some lollywood screenwriting;)— Sohaib Najeeb Khan (@Sohaibhassankh6) August 28, 2022
ఆ ట్వీట్‌కు పాక్ పౌరులు కౌంటర్లు వేయడం ప్రారంభించారు. “ముందు నేను నిన్న బ్లాక్ చేస్తున్నాను. నువ్వు స్పోర్ట్స్ జర్నలిజం చేయడం మానేసి.. ఏవైనా పిట్టకథలు రాసుకో” అంటూ ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. మరొకరు.. “నువ్వు మాట్లాడేది పూర్తిగా తప్పు.. భారత్ ఎంతో బాగా పర్ఫార్మ్ చేసింది. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పింది” అంటూ ఏకి పారేశారు.
no you are wrong today India played real cricket and build the partnerships 🧿
— jameel Khan (@jameelK60094344) August 28, 2022
Haha leave him, I saw how good your vadapav is 😂😂😂😂😂 stop boasting, u won the match good for u but our team was far better then yours
— Haider Abbas (@haider_ab18) August 28, 2022