టీ20 వరల్డ్ కప్ ఎంతో కీలకమైన న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. గ్రూప్ 2 లో సెమీస్ బెర్త్ కోసం జరుగుతున్న ఈ మ్యాచ్.. ఈ రెండు జట్లకు కాకుండా టీమిండియాకి కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఎన్నో అంచనాల నడుమ బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్థాన్ కి శుభారంభం లభించలేదు. కివీస్ ఫాస్ట్ బౌలింగ్ దాటికి తట్టుకోలేకపోయిన ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్స్ పెవిలియన్ బాటా పట్టేశారు. దీంతో.. ఆఫ్ఘానిస్తాన్ 19 పరుగులకే మూడు కీలకమైన వికెట్స్ చేజార్చుకుంది. ఈ దశలో బ్యాటింగ్ కి వచ్చిన నజీబుల్ జార్దాన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ దశలో నాయబ్ కలసి జోర్డాన్ కీలక భాగ్యస్వామ్యం ఏర్పరిచాడు. ఇక కివీస్ స్పిన్నర్ల పై విరుచుకుపడ్డ నజీబుల్లా జార్దాన్ హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. ఇక.. నజీబుల్లా జార్దాన్ పోరాట పటిమకి ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు.
Sixth T20I fifty for Najibullah Zadran, his second fifty of this #T20WorldCup
A decent comeback by #Afghanistan who are 89/4 (14.5 overs) .. #NZvAFGhttps://t.co/xPxe5NTtu8 pic.twitter.com/dhaTujQXWi
— Cricbuzz (@cricbuzz) November 7, 2021