ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు అంటే మాట అక్షరాలా ధోనీకి సరిపోతుంది. కేవలం గ్రౌండ్ లోనే కాదు.. బయట కూడా తన సింప్లిసిటీతో ఈ మిస్టర్ కూల్ ఆకట్టుకుంటాడు. తాజాగా ఆయన మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. ఈసారి ధోని సింప్లిసిటీకి ఎయిర్ హోస్టెస్ కూడా ఫిదా అయింది.
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఎంత సింపుల్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే మాహీ చాలా అంది అభిమానులని సంపాదించుకోగలిగాడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు అంటే మాట అక్షరాలా ధోనీకి సరిపోతుంది. కేవలం గ్రౌండ్ లోనే కాదు.. బయట కూడా తన సింప్లిసిటీతో ఈ మిస్టర్ కూల్ ఆకట్టుకుంటాడు. ఎంత గొప్ప పేరు సంపాదించినా.. తన మూలా లను మహేంద్రుడు అసలు మర్చిపోడు. చిన్నప్పటినుంచే సింపుల్ గా ఉండడానికి ఇష్టపడే మాహీ..ఏ రోజు కూడా దూకుడుగా ప్రవర్తించలేదు. తాజాగా ఆయన మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. ఈసారి ధోని సింప్లిసిటీకి ఎయిర్ హోస్టెస్ కూడా ఫిదా అయింది.
ఐపీఎల్ అనంతరం ధోనీ మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ సర్జరీ సక్సెస్‌ఫుల్ అయిందని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఇటీవలే వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ధోని తాజాగా తన భార్యతో కలిసి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్నాడు. అయితే ధోనీ అంతటి వాడు కూడా ‘క్యాండీ క్రష్’ ఆడడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. ధోని ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తున్నాడు. సహజంగా స్టార్లు బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తారు. కానీ ధోని మాత్రం చాలా సామాన్యుడిలా ఇలా ఎకానమీ క్లాస్ లో ట్రావెల్ చేసి అందరిని మరోసారి తన సింప్లిసిటీతో ఫిదా చేసాడు. ఈ సందర్భంగా ఎయిర్ హోస్టెస్ కూడా అక్కడ ధోని ఉండడం చూసి షాక్ అయింది.
ధోనీని చూసిన ఆనందంలో ఎయిర్ హోస్టెస్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సంతోషాన్ని ఆపుకోలేక ఒక ట్రే నిండా చాక్లెట్స్ తీసుకెళ్లి ధోనీకి ఇచ్చింది. ఆ సమయంలో ఎయిర్ హోస్టెస్ తనను పలకరించగానే గేమ్ పక్కన పెట్టిన ధోనీ.. ఆమెను నవ్వుతూ పలకరించాడు. అభిమానంతో చాక్లెట్లు అన్నీ ఇవ్వబోతుంటే.. ఒక చిన్న ప్యాకెట్ తీసుకొని నాకిది సరిపోతుందని చెప్పాడు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ పెట్టడంతో వీరి సంభాషణ ఏంటో అర్ధం కాలేదు. ఈ చాక్లెట్లతోపాటు ఆమె ఒక స్లిప్ కూడా ధోనీకి ఇచ్చింది. దానిలో ఏం రాసి ఉందో కూడా తెలియదు. ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ ఆటగాడు ఇలా ఎకానమీ క్లాస్ లో ప్రయాణించడం, క్యాండీ క్రష్ ఆడడం, ఎయిర్ హోస్టెస్ తో నడుచుకున్న తీరు ఇలా అన్ని రకాలుగా ధోని తన సింప్లిసిటీని చాటుకున్నాడు. మరి ధోని మరోసారి తన సింప్లిసిటీతో అందరిని ఫిదా చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
The way he winks his eyes 🥺
Also the way she is acting kittenish while having is wife right next to him 🥰What a video @msdhoni 🤩 pic.twitter.com/SkrhQeZnDE
— LEO (@BoyOfMasses) June 25, 2023