టీమిండియా డాషింగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒక రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై రాహుల్ భార్య అతియా శెట్టి రియాక్ట్ అయింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
ఐపీఎల్-2023లో ఆడుతూ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ట్రీట్మెంట్ కోసం లండన్‌కు వెళ్లాడు. సర్జరీ అయ్యాక అక్కడే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటున్నాడు. మెళ్లిగా రికవర్ అవుతున్న రాహుల్ తన సతీమణి అతియా శెట్టితో పాటు ఫ్రెండ్స్‌తో కలసి లండన్ వీధుల్లో విహరిస్తూ కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్గా వీళ్లందరూ కలసి ఒక అడల్ట్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడ కేఎల్ రాహుల్ ఆడి పాడుతూ కనిపించాడు. రాహుల్ ఆ క్లబ్లో ఉన్న వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అతడ్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘ఆపరేషన్ కోసం వెళ్లి నువ్వు చేస్తున్న పనులు ఇవేనా’ అంటూ మండిపడుతున్నారు.
రాహుల్‌పై ట్రోలింగ్ ఎక్కువవడంతో అతడి భార్య అతియా శెట్టి.. ఈ విషయంపై ఇన్స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. తాను సాధారణంగా ఎలాంటి విషయం మీదా రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉంటానని.. కానీ కొన్నిసార్లు తమ కోసం తాము నిలబడటం చాలా ముఖ్యమని ఆమె స్పష్టం చేసింది. అందరిలాగే తాను, రాహుల్, కొందరు ఫ్రెండ్స్ కలసి.. ఒక సాధారణ ప్రదేశానికి వెళ్లామని తెలిపింది. ఇలాంటి విషయాలను సందర్భానుసారం తీసుకోవాలని.. ఏదైనా అనే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని పేర్కొంది. ఈ క్లబ్ కాంట్రవర్సీపై అతియా స్పందించినప్పటికీ.. ఇప్పటిదాకా రాహుల్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడం గమనార్హం. మరి.. కేఎల్ రాహుల్ అడల్ట్ క్లబ్ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Statement from Athiya Shetty about the video circulating in social media of Rahul, Athiya & his friends. pic.twitter.com/kuMlnL6DXP
— Johns. (@CricCrazyJohns) May 27, 2023