ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో టెస్టు క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌లా దూకుడుగా ఆడతాడన్న విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్‌లో టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేసే ఆటగాడిగా బెయిర్‌స్టోకు పేరుంది. జూన్‌లో భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో కూడా బెయిర్‌స్టో ఎటాకింగ్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20ల్లో మాత్రం బెయిర్‌స్టో పెద్దగా ప్రభావం చూపలేదు.
తాజాగా సౌతాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కూడా బెయిర్‌స్టో విఫలం అయ్యాడు. టెస్టులనే టీ20 స్టైల్లో ఆడే బెయిర్‌స్టో.. టీ20లో మాత్రం టెస్టు బ్యాటింగ్ శైలిని తలపించాడు. 30 బంతులను ఎదుర్కొని కేవలం రెండంటే రెండే ఫోర్లు కొట్టాడు. మొత్తం 20 ఓవర్లలో 6 ఓవర్లు ఒక్కడే ఆడి చేసిన పరుగులు 27 మాత్రమే. దీంతో బెయిర్‌స్టోపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.
టెస్టుల్లో టీ20 బ్యాటింగ్ కాదు.. ముందు టీ20ల్లో టీ20 స్టైల్ బ్యాటింగ్ చేయమని చురకలు అంటిస్తున్నారు. కాగా.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ దారుణ ఓటమి మూటగట్టుకుంది. మూడు టీ20ల్లో తొలి మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. మరి బెయిర్‌స్టో బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 RESULT | SOUTH AFRICA WIN BY 90 RUNS
Another brilliant day in the field, with Tabraiz Shamsi grabbing a maiden T20I 5-wicket haul, backed up Reeza Hendricks’ 70 and Markram’s 51* – as England are dismissed for 101! The #Proteas secure the series 2-1!#ENGvSA #BePartOfIt pic.twitter.com/sqmcQeL8X8
— Cricket South Africa (@OfficialCSA) July 31, 2022