సాధారణంగా క్రికెటర్లకు అభిమానులు ఉంటారు. కానీ ఆ క్రికెటర్లే అభిమానులుగా మారిపోతే.. అదేనండి ఓ ఆటగాడు మరో ఆటగాడికి అభిమానిగా మారడం అన్నమాట. ఇక వరల్డ్ క్రికెట్ లో చాలా మంది క్రికెటర్లకు క్రికెటర్లే అభిమానులుగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. విరాట్ కోహ్లీకి సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హర్షల్ గిబ్స్ అభిమాని అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ కూడా టీమిండియా దిగ్గజ బ్యాటర్ కు వీరాభిమాని అని తాజాగా వెల్లడించాడు. అతడి ఆటకు తాను ఫిదా అయిపోయానని, అతడు ఆడిన మ్యాచ్ లోనే నా అరంగేట్రం జరగడం చాలా సంతోషకరమైన విషయం అని పేర్కొన్నాడు జో రూట్. అతడే నా రోల్ మోడల్ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు రూట్.
జో రూట్.. కొన్ని రోజుల క్రితం ఐపీఎల్ పై నోరుపారేసుకుని విమర్శలకు గురైయ్యాడు. నేను ఐపీఎల్ డబ్బుకోసం ఆడట్లేదు.. రాబోయే వరల్డ్ కప్ ప్రాక్టీస్ కోసం ఆడుతున్నాను అన్నస్టేట్ మెంట్ పాస్ చేసి విమర్శలపాలైయ్యాడు. ప్రస్తుతం ILT 20 లీగ్ లో పాల్గొంటున్న రూట్.. ఈ లీగ్ లో దుబాయ్ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ వార్త ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్ లో తన రోల్ మోడల్ ఎవరో చెప్పాడు. ఈ సందర్భంగా జో రూట్ మాట్లాడుతూ..”ప్రపంచంలో ఎంతో మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వరల్డ్ క్రికెట్ కు అసలైన నిర్వచనం ఇచ్చింది మాత్రం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్. తన 20 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో రికార్డులను సాధించాడని” రూట్ ప్రశంసలు కురిపించాడు.
ఈ క్రమంలోనే మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. నేను పుట్టక ముందే సచిన్ క్రికెట్ ఆడటం మెుదలు పెట్టాడు అని రూట్ తెలిపాడు. నా చిన్నతనం నుంచి సచిన్ ఆట చూసే పెరిగాను. ఇక అతడు ఆడిన మ్యాచ్ లోనే నేను అరంగేట్రం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని జో రూట్ చెప్పుకొచ్చాడు. సచిన్ ఆటను చిన్నతనం చూసే అతడే నా రోల్ మోడల్ అని అప్పుడే ఫిక్స్ అయ్యాను అని రూట్ పేర్కొన్నాడు. ప్రపంచంలో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నప్పటికీ సచిన్ లాంటి సూదీర్ఘ కెరీర్ ఆడిన ఆటగాళ్లు లేరని కితాబిచ్చాడు. తన కెరీర్ ఎదుగుదలలో సచిన్ ఎంతో ప్రభావం చూపాడని ఈ సందర్భంగా తెలిపాడు జో రూట్. ఇక తాజాగా జరిగిన 2023 ఐపీఎల్ మినీ వేలంలో రూట్ ను తొలుత ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. వేలం ముగుస్తుంది అనగా రాజస్థాన్ రాయల్స్ ను రూ. కోటి రూపాయలకు కొనుగోలు చేసింది.