దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో జరగుతున్న పాక్-ఇంగ్లండ్ టెస్టు తీవ్ర విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. హిస్టారిక్ టెస్టుగా చెప్పుకుంటూ.. నిర్జీవమైన పిచ్‌ను ఏర్పాటు చేయడంపై పాకిస్థాన్ అభిమానులు సైతం పాక్ క్రికెట్ బోర్డుపై మండిపడుతున్నారు. కేవలం బ్యాటింగ్ మాత్రమే అనుకులించే పిచ్‌పై ఇరు దేశాల బ్యాటర్లు సెంచరీలతో రెచ్చిపోతున్నారు. మూడో రోజు కొనసాగుతున్న ఆటలో ఇప్పటికే ఆరు సెంచరీలు నమోదయ్యాయి. అందులు నాలుగు సెంచరీలు ఇంగ్లండ్ ఆటగాళ్లు బాదగా.. రెండు సెంచరీలో పాక్ ఓపెనర్లు కొట్టారు. దీంతో తొలి మ్యాచ్‌లో ఫలితం తేలదంటూ క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌పై ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.
అయితే.. విమర్శల పాలవుతున్న ఈ టెస్టులోనూ.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ కామెడీ పండించాడు. మూడో రోజు ఆటలో భాగంగా పాతబడుతున్న బంతి మెరిపించేందుకు సరికొత్త పద్దతిని కనిపెట్టాడు. ఇంతవరకు ఎవరూ చేయని కొత్త ట్రిక్‌తో బంతిని మెరిపించే ప్రయత్నం చేశాడు రూట్. తన సహచర ఆటగాడు జాక్ లీచ్ బట్టతలపై బాల్‌ను రుద్ది.. నవ్వులు పూయించాడు. బౌలింగ్ మార్పు కోసం అందరు ఆటగాళ్లు ఒక చోట గుమ్మిగూడిన టైమ్‌లో జాక్ లీచ్ తనపై క్యాప్ తీసిన రూట్.. బాల్‌ను లీచ్ బట్టతలపై సుతిమెత్తగా తిప్పాడు. దీంతో బాల్‌కు అతని బట్టతలపై ఉన్న చెమట అంటింది. మళ్లీ దాన్ని హ్యాండ్ టవల్‌తో గట్టిగా రుద్దుతూ.. బంతిని మెరిపించేందుకు ట్రై చేశాడు.
ప్రస్తుతం రూట్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాల్‌ను షైన్ చేయడానికి రూట్ కొత్త పద్దతి కనిపెట్టాడంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో సైతం వీడియో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా.. గతంలో బ్యాట్‌ను చేత్తో పట్టుకోకుండా నిలువునా నిలబెట్టిన రూట్.. ఇప్పుడు గుండుపై బాల్ రుద్ది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ప్రస్తుతం తొలి టెస్టు మూడో రోజు ఆట లంచ్ సమయానికి పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్లు అబ్దుల్ షఫీక్ 114, ఇమామ్ ఉల్ హక్ 121, అజహర్ అలీ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కెప్టెన్ బాబర్ అజమ్ 28, షకీల్ పరుగులేమీ చేయకుండా క్రీజ్‌లో ఉన్నారు. బాల్‌ను తన బట్టతలపై రుద్దించుకున్న జాక్‌లీచ్ రెండు వికెట్లు పడగొట్టాడు. విల్ జాక్స్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయింది.
“Absolutely ingenious!”
Root finds a unique way of shining the ball with the help of Leach 🤝😅#PAKvENG | #UKSePK pic.twitter.com/mYkmfI0lhK
— Pakistan Cricket (@TheRealPCB) December 3, 2022