ఐపీఎల్ 2022లో రెండు వరుస విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి రైజింగ్‌లో ఉంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైనా.. తర్వాత పుంజుకుంది. ఇప్పుడు తమ ఐదో మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. కేకేఆర్‌పై గెలిచి మూడో గెలుపును నమోదు చేసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తుంది. ఈ క్రమంలో ఆ టీమ్ సోషల్ మీడియాలో డిపార్ట్‌మెంట్.. SRH కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో పోల్చుతూ.. పవన్ సూపర్ హిట్ మూవీ వకీల్‌సాబ్ గెటప్‌లో విలియమ్సన్ పోస్టర్‌ను ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
కేకేఆర్‌తో పోరులో విజయం ఖాయమని.. ధీమా వ్యక్తం మ్యాచ్ డే పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పవన్ మూవీ పోస్టర్‌లో బేస్ బాల్ స్టిక్, చేతిలో బుక్‌తో ఉంటే లుక్‌లో.. కేన్ మామ చేతిలో క్రికెట్ బ్యాట్, బుక్‌తో ఐపీఎల్‌సాబ్‌లా ఉన్నాడు. కేన్ మామకు బేస్‌లో బాదడమూ తెలుసూ.. స్పిన్ బౌలింగ్‌లో బ్యాట్ తీసుకొని కొట్టడమూ తెలుసని SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కేన్ మామ వకీల్‌సాబ్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రషీద్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన SRH కోచ్ ముత్తయ్య మురళీథరన్
Order! Order! Order! 👨⚖
A third consecutive victory is in our sights tonight.#SRHvKKR #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/cys4L20y0n
— SunRisers Hyderabad (@SunRisers) April 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.