ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో రసవత్తర మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ ని ఎదుర్కోవడానబోతుంది. ఈ ఆదివారం దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. మరోవైపు న్యూజిలాండ్ కి కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో.., న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మ్యాచ్ కి ముందు కవ్వింపు చర్యలకి దిగాడు.
“ఈ కీలకమైన మ్యాచ్ కోసం ప్లాన్ ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ.., లెఫ్ట్ ఆర్మర్ షాహీన్ అఫ్రీది బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. అతను ఇండియన్ టాప్ ఆర్డర్ ని క్రీజ్ లో కుదురుకోనివ్వకుండా అవుట్ చేశాడు. ఈరోజు నేను కూడా అతనిలానే బౌలింగ్ చేయాలనుకుంటున్నాను. తొలి వికెట్లు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెంచుతాయి. కానీ మనం బంతిని ఎక్కడ వెయ్యలనుకున్నామో అనే విషయంలో స్పష్టంగా ఉండాలి. ఈ విషయంలో షాహీన్ ని ఫాలో అవుతాను” అని బౌల్ట్ తెలియజేశాడు.
ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. ఇప్పుడు న్యూజిలాండ్ పై భారత్ కి అంత మెరుగైన రికార్డు లేకపోవడం ఆందోళనని కలిగిస్తోంది. లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ సంధించే ఇన్ స్వింగర్స్ ని ఎదుర్కోవడంలో ఇండియన్ ఆటగాళ్లు ఎప్పుడూ తడబడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ట్రెంట్ బౌల్ట్ నాలుగు ఓవర్లు మ్యాచ్ లో ఎంతో కీలకం కానున్నాయి. కానీ.., ఒక్కసారి ఇండియన్ టాప్ ఆర్డర్ కుదురుకుంటే మాత్రం కివీస్ పై విజయం సాధించడం అంత కష్టమైన పని ఏమి కాదు. మరి.. మ్యాచ్ కి ముందు ట్రెంట్ బౌల్ట్ చేసిన సవాలుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.