గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ ఉంటే పరుగులు వస్తూనే ఉంటాయి. కేవలం బౌండరీలు కాదు సింగిల్స్ డబుల్స్ మీద దృష్టి పెడతాడు విరాట్. ఈ లక్షణమే విండీస్ మాజీ ప్లేయర్ ఇయాన్ బిషప్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.
క్రికెట్ లో పరుగుల పరంగానే కాదు ఫిట్ నెస్ విషయంలోనూ విరాట్ కోహ్లీ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాడు. 2008 లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ..16 ఏళ్ళు గడిచినా అంతే ఎనర్జీగా కనిపిస్తున్నాడు. తొలి మ్యాచులో ఎంత అంకిత భావంగా ఆడాడో ఇప్పుడు కూడా పరుగులు చేయాలనే తపన కోహ్లీలో ఇంకా అలాగే ఉంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా, ప్రత్యర్థి ఎవరైనా, ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా విరా గ్రౌండ్ లో ఉంటే పరుగులు వస్తూనే ఉంటాయి. చాప కింద నీరులా విరాట్ పరుగుల ప్రవాహం ఉంటుంది. కేవలం బౌండరీల మీదే కాదు పరుగులు చేసే ఏ అవకాశాన్ని కోహ్లీ వదలడు. ఈ లక్షణమే విండీస్ మాజీ ప్లేయర్ ఇయాన్ బిషప్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండు టెస్టులో విరాట్ కోహ్లీ తన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. 161 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 87 పరుగులు చేసి తొలి రోజు అజేయంగా నిలిచాడు. పరుగులు చేయడం అలవాటుగా మార్చుకున్న విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చూసి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ విరాట్ ఇన్నింగ్స్ లో ఎంతో పరిణితి, డెడికేషన్ చూస్తే కింగ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వికెట్ల మధ్యలో చిరుతలాగా పరిగెడుతూ ఒకటి, రెండు పరుగుల విషయంలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించలేదు. సాధారణంగా టెస్టు క్రికెట్ అంటే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించారు. కానీ కోహ్లీ అలా కాదు టీం తరపున ఒక్క పెరుగుని కూడా చాలా అమూల్యంగా భావించాడు.
టెస్టు క్రికెట్ లో పరుగు కోసం ఎన్నో సార్లు డైవ్ చేస్తూ కనిపించాడు. బౌండరీలు కష్టంగా ఉన్న పిచ్ మీద సింగిల్స్ డబుల్స్ మీద దృష్టి పెట్టాడు. దీనిపై విండీస్ మాజీ ప్లేయర్ ప్రముఖ కామెంటేటర్ ఇయాన్ బిషప్ మాట్లాడుతూ “విరాట్ కోహ్లీ 500 మ్యాచ్ ఆడుతున్న అతడికి ప్రతి పరుగు విలువ తెలుసు. గ్రౌండ్ లో చిరుతల పరిగెడుతూ డైవ్ చేస్తున్న అతడి కమిట్ మెంట్ చూస్తుంటే షాకింగా అనిపిస్తుంది. క్రికెట్ అంటే బౌండరీలు కాదు సింగిల్స్, డబుల్స్ మీద ఎలా దృష్టి పెట్టాలో ప్రతి యంగ్ ప్లేయర్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలి. వెస్టిండీస్ ప్లేయర్లు టెస్టు క్రికెట్ లో రాణించాలంటే బౌండరీల దృష్టి పెట్టొద్దు” అని తెలియజేశాడు. మరి కోహ్లీ డెడికేషన్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.