భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అతడి మీద నెటిజన్స్ విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
మన దేశంలో మూడు రంగాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అవే రాజకీయ, సినీ, క్రీడా రంగాలు. భారత్‌లో స్పోర్ట్స్ అంటే దాదాపుగా క్రికెట్ అనే భావం స్థిరపడిపోయింది. టెన్నిస్, హాకీ, బాక్సింగ్, ఫుట్‌బాల్, కబడ్డీ, కుస్తీ లాంటి ఇప్పుడిప్పుడే క్రేజ్ పెరుగుతోంది. పొలిటీషియన్స్, సినీ స్టార్స్, క్రికెటర్స్‌కు మన దేశంలో ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా క్రికెటర్లను ఆరాధించే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. అందుకే క్రికెటర్ల గేమ్‌తో పాటు వారి పర్సనల్ లైఫ్‌లోని విషయాలు తెలుసుకునేందుకు కూడా అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి విషయాలు తెలిసినప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా చేస్తుంటారు. ఇంత ఫ్యాన్ బేస్ కలిగిన క్రికెటర్లు ఎంతో హుందాగా ప్రవర్తించాలి లేకపోతే విమర్శలపాలవక తప్పదు. కాగా, టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోమారు ట్రోలింగ్‌కు గురయ్యాడు.
ఐపీఎల్ పదహారో సీజన్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యాకు కావాల్సినంత విరామ సమయం దొరికింది. దీంతో తన ఫ్రీ టైమ్‌ను పూర్తిగా కుటుంబానికి కేటాయించాడు. భార్య నటాషా స్టాంకోవిచ్, కుమారుడు అగస్త్యతో కలసి థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్లాడు హార్దిక్. ఈ ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలను నటాషా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలే ఇప్పుడు హార్దిక్ దంపతులపై నెటిజన్స్ ట్రోలింగ్‌కు కారణమయ్యాయి. ఈ ఫొటోల్లో పాండ్యా-నటాషాలు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు భార్యకు ముద్దులు పెడుతూ రెచ్చిపోయాడు హార్దిక్. దీంతో స్టార్ ఆల్‌రౌండర్‌ను నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ‘ఇలాంటి ఫొటోలతో ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు’ అంటూ పాండ్యాను విమర్శిస్తున్నారు. నటాషా డ్రెస్సింగ్‌ను కూడా విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.