ప్రపంచ క్రికెటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదన ఎక్కువని తెలుస్తుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం కోహ్లీ ఇద్దరు క్రికెటర్ల కంటే వెనుకంజలో ఉన్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కేవలం ఆట పరంగానే కాదు సంపాదనలోనూ తనకి తానే సాటి. సంపాదనలోనూ ‘కోహ్లీ’ కింగే.ఇటీవలే విరాట్ వార్షిక వార్షిక ఆదాయం ఇటీవలే వెయ్యి కోట్లు దాటిందనే వార్తలు వచ్చాయి. కోహ్లీ సంపాదనను ఒకసారి పరిశీలిస్తే.. టెస్టుకు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ 20మ్యాచ్ కి 3 లక్షలు మ్యాచ్ ఫీజ్ ద్వారా వస్తాయి. ఇక ఐపీఎల్ లో ప్రతి ఏడాది విరాట్ 15 కోట్లు తీసుకుంటాడు. అయితే, బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్లు, ఇతర కంపెనీల పెట్టుబడులు, ఇన్‍స్టాగ్రామ్ పోస్టుల నుంచి భారీ ఆదాయం గడిస్తున్నాడు విరాట్. ఇంతలా సంపాదించే కోహ్లీ.. ఒక విషయంలో ఓ ఇద్దరు క్రికెటర్ల వెనుకనే ఉన్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం A+ కేటగిరిలో ఉన్న కోహ్లీకి ప్రతి సంవత్సరం బీసీసీఐ 7 కోట్లను చెల్లిస్తుంది. అయితే ఈ లిస్టులో ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అందరికంటే కోహ్లీ కంటే ముందున్నారు. రూట్ కి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 7.5 కోట్లను చెల్లిస్తుండగా.. కమ్మిన్స్ కి మాత్రం ఆసీస్ బోర్డు ఏకంగా 11.18 కోట్లు చెల్లిస్తుంది. కమ్మిన్స్ తన బౌలింగ్ తో పాటు కెప్టెన్ గాను రాణించాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ తో పాటు, తాజాగా యాషెస్ లోని తొలి రెండు టెస్టులని కూడా గెలిపించాడు. దీంతో ఈ ఆసీస్ కెప్టెన్ కి అందరి కంటే ఎక్కువ మొత్తం క్రికెట్ ఆస్ట్రేలియా చెల్లిస్తుంది. ఇక రూట్ కూడా గత కొన్నేళ్లుగా వరుసపెట్టి సెంచరీలు బాదేస్తూ భారీ మొత్తం అందుకుంటున్నాడు.ఇదిలా ఉండగా ఓవరాల్ గా చూసుకుంటే కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.