బజ్ బాల్.. గత కొన్ని నెలలుగా టెస్టు క్రికెట్ లో ఇంగ్లాండ్ ఫాలో అవుతున్న ఫార్ములా. అయితే ఇటీవలే టెస్టు ఛాంపియన్ షిప్ గెలిచిన పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు ముందు ఇలాంటి పప్పులు ఏవి ఉడకవనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ యాషెస్ లో కూడా ఇదే తంతా ఫాలో అవుతుంది.
బజ్ బాల్.. గత కొన్ని నెలలుగా టెస్టు క్రికెట్ లో ఇంగ్లాండ్ ఫాలో అవుతున్న ఫార్ములా. టెస్టులను కూడా వన్డే తరహాలో ఆడుతూ ఆడియన్స్ కి కిక్ ఇస్తుంది. ‘బజ్‌బాల్’ ప్లాన్‌తో ప్రత్యర్థులకి చుక్కలు చూపిస్తుంది. మెక్కలం కోచ్ గా అడుగు పెట్టినప్పటినుండి ఇంగ్లాండ్ ఈ విధానాన్ని అవలంబిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా వన్డే, టీ20 స్టయిల్‌లో టెస్టులు ఆడేస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఇక యాషెస్ లో భాగంగా కూడా ఇదే స్టయిల్లో తమ అప్రోచ్ ఉంటుందని ముందుగానే ఆసీస్ కి హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇటీవలే టెస్టు ఛాంపియన్ షిప్ గెలిచిన పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు ముందు ఇలాంటి పప్పులు ఏవి ఉడకవనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ యాషెస్ లో కూడా ఇదే తంతా ఫాలో అవుతుంది.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ నేడు ప్రారంభమైంది. బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో మొదటి బంతి నుంచే ఎదరు దాడికి దిగినట్లుగా కనిపించింది. కమ్మిన్స్ వేసిన మొదటి బంతికే ఫోర్ కొట్టి ఇన్నింగ్స్ ఆరంభించాడు ఓపెనర్ క్రాలి. ఇది చూసిన కెప్టెన్ స్టోక్స్ షాకైన రియాక్షన్ వైరల్ గా మారింది. ఇక దాదాపు 5 రన్ రేట్ తో ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం 60 ఓవర్లలో 5 వికెట్లను 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ లో బెయిర్ స్టో 100 స్ట్రైక్ రేట్ తో 78 పరుగులు చేయడం గమనార్హం. ఇక మరో ఎండ్ లో రూట్ అర్ధ సెంచరీ చేసి తన పాత్రను సమర్ధంగా పోషిస్తున్నాడు. ఓపెనర్ క్రాలి అర్ధ సెంచరీ చేయగా.. పొప్, బ్రూక్ పర్వాలేదనిపించారు. మొత్తానికి ఆసీస్ కి ఇంగ్లాండ్ బజ్ బాల్ రుచి చూపించింది. ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.