బ్రెయిన్ చార్లెస్ లారా.. ఈ పేరు వెస్టిండిస్ లోనే కాదు.. యావత్ ప్రపంచ క్రికెట్‌లో ఒక సంచలనం. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించడం మాత్రమే ఆయనకు తెలుసు. లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్, వన్డే, టెస్టు మ్యాచ్ ఇలా లారాకు సంబంధించిన ఏ గణాంకాలు చూసినా నోరెళ్లబెట్టాల్సింది. ఈరోజుల్లో టీ20 ఆడితే వన్డేలు ఆడరు, వన్డేల్లో రాణిస్తే.. టెస్టులకు పనికిరారు. కానీ, లారా మాత్రం వన్డే, టెస్టులు రెండింట అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 501* పరుగులతో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు అంటే బ్రెయిన్ లారాని ఎంతో మంది అభిమానిస్తున్నారు. కానీ, ఆ రోజ్లులో లారా అభిమాన క్రికెటర్ వివ్ రిచర్డ్స్. తన రోల్ మోడల్‌గా ఆరాదిస్తున్న రిచర్డ్స్ చేతిలో లారాకు పెద్ద అవమానమే జరిగిందంట.
హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌లో క్రికెట్ దిగ్గజాలు బ్రెయిన్ లారా, సచిన్ టెండుల్కర్ పాల్గొన్నారు. ఆ సమయంలో హోస్ట్ నుంచి సచిన్‌కి, లారా ఓ ప్రశ్న ఎదురైంది. మీరు రోల్ మోడల్‌గా భావించే రిచర్డ్స్ తో మీకున్న అనుభవాలను పంచుకోవాలంటూ కోరగా.. సచిన్ మాట్లాడుతూ “వివ్ రిచర్డ్స్ అంటే నాకు ఎంతో ఇష్టం ఉండేది. ఆయన నా రోల్ మోడల్. కెరీర్ ప్రారంభంలో ఆయన్ని కలవాలి అని ఎంతో తహతహలాడే వాడిని. కెరీర్ సాగిన కొద్దీ చాలాసార్లు కలిశాను, మాట్లాడాను. నేను 2007 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవ్వాలి అనుకున్నాను. కానీ, వివ్ రిచర్డ్స్ నాతో మాట్లాడారు. నీలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది.. అని చెప్పి నా రిటైర్మెంట్ వాయిదా వేయించారు” అంటూ సచిన్ టెండుల్కర్ చెప్పుకొచ్చాడు.
#HTLS2022 | How Viv Richards stopped @sachin_rt from retiring in 2007 pic.twitter.com/6I5Ph1ebYx
— Hindustan Times (@htTweets) November 12, 2022
రిచర్డ్స్ తో తనకున్న అనుబంధాన్ని బ్రెయిన్ లారా కూడా పంచుకున్నాడు.. “ఎవరు ఎన్ని విజయాలు సాధించినా కూడా.. కెరీర్‌లో డెబ్యూ మ్యాచ్‌లు అందరికీ గుర్తుంటాయి. నేను ఒక వీక్ ముందు ఇండియాపై సెంచరీ చేశాను. నాకు టీమ్ నుంచి పిలుపు వచ్చింది. అయితే నాకు ఫైనల్‌స్క్వాడ్‌లో స్థానం దక్కలేదు. కానీ జట్టులో చోటు దక్కింది. ఆ మ్యాచ్ మా స్వస్థంలో జరుగుతోంది. ప్రాక్టీస్ ఉదయం 9 గంటలకు అయితే.. నేను ఉదయాన్నే 8 గంటలకు గ్రౌండ్‌కి వెళ్లి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. తర్వాత మా జట్టును తొలిసారి కలిసేందుకు డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాను. అప్పుడు రూమ్‌లో నుంచి నా బ్యాగ్ బయటకు విసిరేశారు. కిందపడి పోయిన నా వస్తువులు తీసుకుని లోపలికి వెళ్లాను. తర్వాత తెలిసింది రిచర్డ్స్ పదిహేనేళ్లుగా బ్యాగ్ పెట్టే ప్లేస్ లో నేను పెట్టానని. తర్వాత బ్యాగ్ పడేసింది రిచర్డ్స్ అని చెప్పారు. అయితే నేను దానిని తప్పుగా తీసుకోలేదు” అంటూ లారా చెప్పుకొచ్చాడు.
#HTLS2022 | Viv Richards had tossed @BrianLara‘s kit out of the dressing room. Here’s Why pic.twitter.com/CXn3bO9uKO
— Hindustan Times (@htTweets) November 12, 2022