సన్ రైజర్స్ జట్టులో హెడ్ కోచ్ గా సెహ్వాగ్ రాబోతున్నాడా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానం వినిపిస్తుంది. భారత మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ లారా స్థానంలో హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
2023 ఐపీఎల్లో 14 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఈ ఏడాది చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చిందని విమర్శలు తలెత్తాయి. దీంతో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది యాజమాన్యం.
వెస్టిండీస్ క్రికెట్ జట్టు అంటే గతమెంతో ఘనం అన్న సమెత గుర్తుకు వస్తుంది. క్రికెట్‌లో వన్డే వరల్డ్ కప్ పుట్టిన తర్వాత తొలి రెండు వరల్డ్ కప్‌లను నెగ్గి క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన జట్టు.. ఇప్పుడు వన్డేల్లో 10వ స్థానంలో ఉంది. ఇలాంటి ఆధ్వాన పరిస్థితుల్లో ఉన్న కరేబియన్ క్రికెట్‌ను గాడిలో పెట్టి, పూర్వవైభవం తెచ్చేందుకు విండీస్ క్రికెట్ బోర్డు చాలా కాలానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రెయిన్ లారాను వెస్టిండీస్ […]
బ్రెయిన్ చార్లెస్ లారా.. ఈ పేరు వెస్టిండిస్ లోనే కాదు.. యావత్ ప్రపంచ క్రికెట్‌లో ఒక సంచలనం. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించడం మాత్రమే ఆయనకు తెలుసు. లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్, వన్డే, టెస్టు మ్యాచ్ ఇలా లారాకు సంబంధించిన ఏ గణాంకాలు చూసినా నోరెళ్లబెట్టాల్సింది. ఈరోజుల్లో టీ20 ఆడితే వన్డేలు ఆడరు, వన్డేల్లో రాణిస్తే.. టెస్టులకు పనికిరారు. కానీ, లారా మాత్రం వన్డే, టెస్టులు రెండింట అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. […]
బిగ్ బాస్ 6వ సీజన్ మెల్లగా పికప్ అవుతోంది. తొలి రెండు వారాలు కాస్త చప్పగా సాగిన ఈ షో.. మూడో వారానికి వచ్చేసరికి రసవత్తరంగా తయారైంది. నామినేషన్స్ లోనే గొడవలు పడ్డారు. ఫిజికల్ గా కొట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. దీంతో ఈసారి ఏకంగా 10 మంది నామినేషన్స్ లో నిలిచారు. వీళ్లలో నేహా చౌదరి కూడా ఒకరు. ఇప్పుడు ఆమెకి సపోర్ట్ చేసి, ఓట్లు వేయమని ఏకంగా దిగ్గజ క్రికెటర్ చెప్పాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. కొత్త ఫ్రాంచైజీలు గుజరాత్, లక్నో రెండు జట్లు మంచి ప్రదర్శనతో దూసుకుపోతున్నాయి. చెన్నై, ముంబయి పరిస్థితి చెప్పనవసరం లేదు. 5 వరుస విజయాలతో అప్రతిహితంగా కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్రేకులు పడ్డాయి. గుజరాత్ టైటాన్స్ ఎస్‌ఆర్‌హెచ్ విజయావకాశాలపై గట్టి దెబ్బ కొట్టింది. అయితే చివరి వరకు గెలుస్తారనుకున్న మ్యాచ్ లో రషీద్, తెవాటియా ధ్వయం హైదరాబాద్ కు పరాయజయాన్ని మిగిల్చింది. అయితే రషీద్ ఖాన్ అంతలా […]