అభిమానం హద్దులు మీరనంత సమస్య ఉండొద్దు కానీ, అదే అభిమానం తంటాలు తెచ్చిపెడుతోంది. తాజాగా సచిన్ టెండ్యూలర్ కి ఎదురైంది.
అభిమానం ఉండొచ్చు కానీ ఇబ్బందులకు గురి చేయకూడదు. సెలబ్రిటీలకు ఈ అభిమానమే తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇటువంటి చేదు అనుభవానే ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములా రేస్ వీక్షించేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. అయితే ఇక్కడ రద్దీ దృష్ట్యా ఆయన వాహనాన్ని చాలా దూరంలో నిలిపారు. ఫార్ములా రేస్ ముగిసిన తర్వాత తన వాహనం కోసం సచిన్ వెళుతుండగా ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో ఆయన కిలోమీటర్ వరకు కారు కోసం నడవాల్సి వచ్చింది. ఈ సమయంలో సచిన్ కూడా ఒకింత అసహనానికి గురైనట్లు సమాచారం.
శనివారం హైదరాబాద్ లో ఫార్ములా రేస్ జరుగుతున్నాయని తెలిసిన నాటి నుండి వాటిని వీక్షించేందుకు వేలాది మంది వచ్చారు. హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ సర్క్యూట్ వద్ద ఈ ప్రిక్స్ లో ఈ రేస్ జరుగుతుంది. ఈ రేసులో 11 జట్లు పోటీపడగా, 22 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. విజేతలను కూడా ప్రకటించారు. వీటిని తిలకించేందుకు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కెటీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి సహా పలువురు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత సచిన్ హైదరాబాద్ రావడంతో అభిమానులు చూసేందుకు ఎగబడ్డారు. దీంతో కాస్త ఇబ్బందికి గురైన ఆయన తన కారు కోసం కిలోమీటర్ నడవాల్సి వచ్చింది.