SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Bhuvneshwar Kumar Bowling With 208 Kmph Speed Against Ireland

Bhuvneshwar Kumar: అక్తర్‌ను ఆరేశాడు.. ఉమ్రాన్‌ను ఊదేశాడు! 208 స్పీడ్‌తో భువీ బౌలింగ్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Mon - 27 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bhuvneshwar Kumar: అక్తర్‌ను ఆరేశాడు.. ఉమ్రాన్‌ను ఊదేశాడు! 208 స్పీడ్‌తో భువీ బౌలింగ్‌

టీమిండియా సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మంచి పేస్‌ బౌలర్‌. సీమ్‌ ప్రజెంటేషన్‌ కచ్చితంగా ఉంటుంది. ఇన్‌ స్వింగర్లు, అవుట్‌ స్వింగర్లతో బ్యాటర్ల బోల్తాకొట్టించడంలో భువీ దిట్టా. కానీ.. స్పీడ్‌ విషయంలో మాత్రం అంతగా ప్రభావం చూపలేడు. ఇది ఇప్పటి వరకు భువీపై సగటు క్రికెట్‌ అభిమానికి తెలిసిన విషయం. స్పీడ్‌ బౌలింగ్‌ అంటే అందరికి పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌, ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ బ్రెట్‌లీ, సౌతాఫ్రికా స్పీడ్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌ గుర్తుకువస్తారు. ప్రస్తుత క్రికెట్‌లో న్యూజిలాండ్‌ పేసర్‌ ఫెర్గూసన్‌, ఇంగ్లండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ మంచి స్పీడ్‌తో బౌలింగ్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌తో మన ఇండియన్‌ కుర్రాడు ఉమ్రాన్‌ మాలిక్‌ ఏకంగా గంటకు 157 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్‌ వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచ క్రికెట్‌లో షోయబ్‌ అక్తర్‌ పేరున చెక్కు చెదరకుండా ఉన్న ఫాస్టెస్ట్‌ డెలివరీ రికార్డును ఉమ్రాన్‌ మాలిక్‌ భవిష్యత్తులో బద్దలు కొట్టేలా కనిపించాడు.

కానీ.. ఉమ్రాన్‌ మాలిక్‌, అక్తర్‌ వేసిందే అసలు స్పీడ్‌ బౌలింగ్గే కాదు అన్నట్లు.. భువనేశ్వర్‌ కుమార్‌ ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఏకంగా గంటకు 208 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసి అందర్ని ఆశ్యర్యానికి గురిచేశాడు. 161.3 వేగంతో షోయబ్‌ అక్తర్‌ వేసిన బంతే ఇప్పటి వరకు ఫాస్టెస్ట్‌ డెలివరీగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు భువీ 208 స్పీడ్‌తో ఆ రికార్డు గల్లంతు అయినట్లు ఇండియన్‌ ఫ్యాన్స్‌ సంబురపడ్డారు. కానీ వారి సంతోషం అంతలోనే ఆవిరైంది. పేస్‌ కంటే స్వింగ్‌పైనే ఎక్కువ ఆధారపడే భువీ ఇంత స్పీడ్‌తో బౌలింగ్‌ వేశాడా? అనే అనుమానం అందరిలో ఉన్నా.. స్పీడో మీటర్‌పై 208 కేఎంపీహెచ్‌ చూపించడంతో అంతా నిజమనుకున్నారు. కానీ.. అది స్పీడో మీటర్‌ తప్పిదం వల్ల అలా చూపించిందని తెలిసి నవ్వుకున్నారు.

Bhuwaneswar

ఇక మీమర్లు ఈ ఘటనపై దారుణంగా స్పందిస్తున్నారు. స్పీడో మీటర్‌ చూపించిన 208 నంబర్‌ను స్క్రీన్‌షాట్లు తీసి.. సోషల్‌ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. భువనేశ్వర్‌ కుమార్‌ తన స్పీడ్‌తో అక్తర్‌ను ఆరేశాడని, ఉమ్రాన్‌ మాలిక్‌ను ఊదేశాడంటూ జోకులు పేలుస్తున్నారు. భువీ స్పీడ్‌ ముందు ఉమ్రాన్‌ మాలిక్‌ బచ్చా అంటూ మీమ్స్‌ వేస్తున్నారు. వరల్డ్ రికార్డు బద్దలైందంటూ స్పీడ్ మీటర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భువనేశ్వర్‌ కుమార్‌ (1/16), యుజ్వేంద్ర చాహల్‌ (1/11) ప్రత్యర్థిని కట్టడి చేశారు. హ్యారీ టెక్టార్‌ ( 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 నాటౌట్) ఐర్లాండ్‌కు మెరుగైన స్కోరును అందించాడు. అనంతరం దీపక్‌ హుడా ( 29 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స్‌లతో 47 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 ), హార్దిక్‌ పాండ్యా ( 12 బంతుల్లో ఫోర్, మూడు సిక్స్‌లతో 24) చెలరేగడంతో భారత్‌.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో యంగ్‌ (2/18) ఒక్కడే ప్రభావం చూపించాడు.

సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మంగళవారం జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో స్పీడో మీటర్‌ తప్పిదంతో భువీ 208 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్‌ వేసినట్లు చూపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

WORLD RECORD❗

bhuvneshwar kumar delivered a ball at 201 KMPH. Fastest ball of cricket history. Sheering pace from bhuvi 🔥#IREvIND #indvsire pic.twitter.com/sz3JDz1Vzu

— Rohit.Bishnoi (@The_kafir_boy_2) June 26, 2022

Bhuvneshwar Kumar was bowled at 200+ KPH during the 1st T20 against Ireland at Dublin. #IREvIND pic.twitter.com/ZnIJAHYf1z

— Cricket insect (@000insect) June 27, 2022

WORLD RECORD BROKEN

Bhuvi broken his own record by bowling at 208 kmph. Bhuvi launching rockets today. This is unbelievable#indvsire #IREvIND pic.twitter.com/FFvzLGfPsN

— Rohit.Bishnoi (@The_kafir_boy_2) June 26, 2022

Tags :

  • Bhuvneshwar Kumar
  • Speed Bowling
  • Umran Malik
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

  • SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

    ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

  • Bhuvneshwar Kumar: అంతర్జాతీయ క్రికెట్ కి భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్..? కారణం అదేనా..

    అంతర్జాతీయ క్రికెట్ కి భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్..? కారణం అదేనా..

  • వరల్డ్ కప్ ముందు షాకింగ్ న్యూస్! అశ్విన్‌, భువీ రిటైర్మెంట్‌!

    వరల్డ్ కప్ ముందు షాకింగ్ న్యూస్! అశ్విన్‌, భువీ రిటైర్మెంట్‌!

  • పిల్లల చదువు కోసం.. గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వర్ కుమార్!

    పిల్లల చదువు కోసం.. గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వర్ కుమార్!

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • కూకట్‌పల్లి చిన్నారి హత్య మిస్టరీ వీడేనా, అసలేం జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam