దేశంలో ‘ఐపీఎల్‘ కు ఉన్న క్రేజే వేరు. టోర్నీ మొదలయ్యిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులకు రెండు నెలల పాటు పండగే. ప్రతి ఏడాది ఐపీఎల్ టోర్నీ.. సమ్మర్ లో నిర్వహించడం కామన్. అయితే.. సమ్మర్ లో దేశంలో ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు. దేశంలో పలుప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిమికి తోడు వడగాలుల తీవ్రత ఎక్కువుగా ఉంటుండడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఆటగాళ్లు సైతం ఎండ వేడిమిని తట్టుకోలేక ఐస్ బాక్స్ ల్లో తల పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ టైమింగ్స్ లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సాయంత్రం 3:30 గంటలకు ప్రారంభమవుతున్న మ్యాచులను ‘సాయంత్రం 4 గంటలకు‘, రాత్రి 7.30 మ్యాచులను ‘రాత్రి 8 గంటలకు’ పొడిగించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే డబుల్ హెడర్ మ్యాచ్‌లు (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) తక్కువుగా ఉంటాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఈ మార్పులు ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. టోర్నీ మొదలైన మొదటి 10 సంవత్సరాలు(2008 – 2017) వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యేవి. అయితే.. 2018-2022 కాలానికి ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్.. మ్యాచ్ ల టైమింగ్స్ ను అరగంట ముందుకు జరిపింది.
ACCORDING TOR REPORTS
BCCI IS PLANNING TO CHANGE THE IPL TIMINGS FROM NEXT SEASON OF IPL 2023 FROM 3:30PM TO 4PM AND 7:30 PM TO 8PM.
— Royalcricketworld (@Royalcricketwo1) May 18, 2022
How to cool off after an intense practice session, @Gmaxi_32 style. 😂🧊 #PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/MlEJpcGI80
— Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022
ఇది కూడా చదవండి: Sara Tendulkar: టిమ్ డేవిడ్ రనౌట్.. స్టేడియంలో ఏడ్చేసిన సారా టెండూల్కర్!
స్టార్ స్పోర్ట్స్ వాదన ప్రకారం.. రాత్రి 8 గంటల కంటే 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభిస్తే.. ప్రైమ్ టైమ్‌లో అదనంగా 30 నిమిషాల వ్యవధి లభిస్తుంది. తద్వారా వీక్షకుల సంఖ్య పెరుగుతుంది, మానిటైజేషన్ కూడా పెరుగుతుంది. అలాగే సాయంత్రం మ్యాచులను కూడా 30 నిమిషాలు ముందుగా 3.30కు ప్రారంభించాలని కోరింది. అందుకు సమ్మతించిన బీసీసీఐ 2018 నుంచి టైమింగ్స్‌లో మార్పులు చేసింది. 2023-27 వరకు టెలివిజన్, డిజిటల్ హక్కుల కోసం బిడ్డింగ్ వేసే బ్రాడ్‌కాస్టింగ్ పార్టీలకు బీసీసీఐ ఈ వివరాలు తెలియజేసినట్లు తెలుస్తోంది. బిడ్డింగ్ జూన్ 12న జరుగనుంది. మరి ఐపీఎల్ టైమింగ్స్ లో మార్పులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
