దేశంలో ‘ఐపీఎల్‘ కు ఉన్న క్రేజే వేరు. టోర్నీ మొదలయ్యిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులకు రెండు నెలల పాటు పండగే. ప్రతి ఏడాది ఐపీఎల్ టోర్నీ.. సమ్మర్ లో నిర్వహించడం కామన్. అయితే.. సమ్మర్ లో దేశంలో ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు. దేశంలో పలుప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిమికి తోడు వడగాలుల తీవ్రత ఎక్కువుగా ఉంటుండడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. […]