ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బిజినెస్, స్పేస్, పొలిటికల్ లీడర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే వారు రాణించని రంగమంటూ లేదు. భారతదేశంలోనూ ప్రపంచ గర్వించ దగ్గ మహిళామణులు ఎందరో ఉన్నారు. వారు పురుషులతో సమానంగా, దీటుగా అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. వారి ఆత్మాభిమానం కోల్పోకుండా వారి కాళ్లపై వారు నిలబడటానికి మహిళలను నేటి సమాజంలో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ లో సైతం మహిళలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తూ.. పురుషులతో సమానంగా చూస్తోంది BCCI.తాజాగా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది బీసిసిఐ. ఈ నిర్ణయంతో క్రికెట్ లో మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని బీసీసీఐ చెప్పుకొచ్చింది.
BCCI.. గత కొంతకాలంగా సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ.. క్రికెట్ చరిత్రలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే పురుషు క్రికెటర్లతో పాటుగా మహిళా క్రికెటర్లకు కూడా మ్యాచ్ లకు సమాన జీతాలు చెల్లిస్తున్నట్లు ఉత్తర్వులు జారిచేసింది. ఇది క్రీడా ప్రపంచంలోనే అత్యుత్తమమైన నిర్ణయంగా మాజీ దిగ్గజాలు కొనియాడారు. ఈ క్రమంలోనే మరో సారి చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుని వార్తల్లో నిలిచింది బీసీసీఐ. ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడేవాళ్లు. అయితే రాను రాను క్రికెట్ లో గణనీయమైన మార్పులు వచ్చాయి. దాంతో క్రమంగా క్రికెట్ లోకి మహిళలు సైతం వచ్చారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటోంది బీసీసీఐ.
అందులో భాగంగానే కొన్ని రోజుల క్రీతం పురుషులతో పాటుగా సమాన వేతనాన్ని ప్రకటించింది. అదీకాక ఇప్పుడు చరిత్రలోనే తొలిసారిగా పురుషుల క్రికెట్ మ్యాచ్ ల్లోకి మహిళా అంపైర్లను తీసుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది. త్వరలో ప్రారంభం కానున్న దేశవాలి రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు గ్రౌండ్ లో మెరవనున్నారు. అదీకాక రానున్న రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ లో సైతం మహిళా అంపైర్లు కనిపించనున్నారు అని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వృందారతి, గాయత్రి, జననిలతో పాటుగా మరికొంత మంది మహిళా అంపైర్లు దేశంలో ఉన్నారు. గతంలో గాయత్రి రంజీ ట్రోఫీలో ఫోర్త్ అంపైర్ గా సేవలను అందించింది. తాజాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మహిళలకు మరిన్ని అవకాశాలను కల్పించేందుకు తోడ్పడుతుందని మాజీ క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Looks like the BCCI has finally taken the initiative and for the first time will allow women’s umpire to stand in senior men’s tournaments.https://t.co/BQ099tRoIj
— News18 CricketNext (@cricketnext) December 6, 2022
It will be a first for Indian cricket when female umpires will be asked to officiate in the men’s cricket matches even as Gayathri has served as a reserve (fourth) umpire in Ranji Trophy in the past@BCCI @BCCIWomen https://t.co/rbQJh5s3ZB
— EastMojo (@EastMojo) December 6, 2022