T-20 క్రికెట్ అంటేనే హిట్టింగ్ కు మారుపేరు. అందుకే ఈ టోర్నీలను ప్రేక్షకుల్లో మంచి ఆదరిస్తారు. టీ-20 మ్యాచ్ అంటేనే క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. క్రమంలో బ్యాటర్లు కొన్ని కళ్లు చెదిరే సిక్సర్లు కొడుతుంటారు. బ్యాటర్లు కొట్టే సిక్సర్లు కొన్ని స్టేడియం అవతల పడితే, మరికొన్ని మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకుల తలల పగిలే చేస్తాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సిక్సర్ మాత్రం కాస్త వేరైటీగా వెళ్లింది. ఓ బ్యాటర్ కొట్టిన సిక్సర్ బంతి ఏకంగా స్టేడియం అవుతల ఉన్న బర్గర్ వ్యాన్ లోకి దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ఇంగ్లండ్ వేదికగా T-20 బ్లాస్ట్ టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్లు భారీ సిక్సర్లు బాదడమే పనిగా పెట్టుకున్నారు. లాంగ్‌షైర్ జట్టు తరఫున ఆడుతున్న లివింగ్ స్టోన్ యార్క్ షైర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బాల్ ను కంటికి కనపడనంత దూరం బాదిన సంగతి తెలిసిందే. తాజాగా మే 30న హాంప్‌షైర్, సోమర్‌సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటి ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హాంప్‌షైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో జేమ్స్ ఫుల్లర్.. వాండర్‌మెర్వ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. భారీ ఎత్తులో వెళ్లిన బంతి నేరుగా స్టాండ్స్‌లో బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లింది.
ఇదీ చదవండి: ఒకప్పుడు న్యూజిలాండ్ క్రికెట్ లో హీరో.. ఇప్పుడు విలన్!
అయితే అదృష్టవశాత్తూ అక్కడ ఎక్కువ జనాలు లేకపోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. బర్గర్ సర్వ్ చేస్తున్న వ్యక్తి మాత్రం..వ్యాన్ లోకి దూసుకొచ్చిన బంతిని పట్టుకుని ఫోటోకు ఓ స్టిల్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జేమ్స్ ఫుల్లర్ రెచ్చిపోయి ధాటిగా ఆడినప్పటికీ హాంప్‌షైర్ 123 పరుగులకే చేయగలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సోమర్‌సెట్ 25 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. మరి..వైరల్ అవుతున్న వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
James Fuller gets hold of this 😳@James_Fuller246 | @hantscricket | #Blast22 pic.twitter.com/jB2ke5mRuT
— Vitality Blast (@VitalityBlast) May 31, 2022
Guess which player hit the match ball into a burger van at the Ageas Bowl tonight? 😆#Blast22 pic.twitter.com/YXBICflW3J
— Vitality Blast (@VitalityBlast) May 30, 2022