వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు.. డ్వేన్ బ్రేవో టి20 క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ టోర్నమెంట్‌లో బ్రావో ఈ ఫీట్ అందుకున్నాడు. హండ్రెడ్ లీగులో నార్తన్ సూపర్‌చార్జర్స్‌కు ఆడుతున్న బ్రావో.. ఓవల్ ఇన్‌విసిబుల్స్‌తో మ్యాచ్‌లో సామ్ కరన్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ మార్క్‌ను అందుకున్నాడు.
డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న బ్రావో 516 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. బ్రావో తర్వాత అఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ 466 వికెట్లు, విండీస్ మ్యాజిక్ స్పిన్నర్ సునీల్ నరైన్ 457 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక.. ఈ మ్యాచ్ లో మొత్తంగా 20 బంతులేసిన బ్రేవో 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. బ్రేవో తన కెరీర్ లో విండీస్ తరపున 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
Dwayne Bravo is streets ahead as he reaches 600 T20 wickets 🙌 pic.twitter.com/xYl0o9vZ02
— ESPNcricinfo (@ESPNcricinfo) August 11, 2022
2018లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన బ్రావో 2020, టీ20 ప్రపంచకప్ దృశ్యా తాను టీ20లకు అందుబాటులో ఉంటానని చెప్పి రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో భాగంగా 2021.. నవంబర్ 6న.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్ చార్జర్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఓవల్ ఇన్‌విసిబుల్స్ 97 బంతుల్లోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
Dwayne Bravo celebrates his 600th T20 wicket with a special dance moves. pic.twitter.com/kmZsb13zdf
— Ishika Pandey (@Ishika_Pandey45) August 12, 2022
ఇదీ చదవండి: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ కు వేధింపులు!
ఇదీ చదవండి: Viral Video: ఆకలిగొన్న పులి విరాట్ కోహ్లీ.. ఈసారి ఘర్జించడం ఖాయం.. ఈ వీడియో ఒక్కటి చాలు!