ఆసియా కప్ 2022లో పాకిస్థాన్ ఫైనల్ వరకు వెళ్లినా.. ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ మాత్రం టోర్నీ ఆసాంతం దారుణంగా విఫలం అయ్యాడు. పూర్ ఫామ్‌తో విమర్శలు మూటగట్టుకున్నాడు. మరో ఓపెనర్ రిజ్వాన్ నిలకడగా రాణించగా.. బౌలర్ల దయతో పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్ వరకు వెళ్లింది. కానీ.. ఫైనల్లో శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌కు ముందు మంచి ఫామ్‌లో ఉన్న బాబర్.. ఆసియా కప్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ప్రస్తుతం బాబర్ వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ కాగా.. టీ20ల్లో నంబర్ టూగా ఉన్నాడు. కానీ.. ప్రస్తుతం తన ర్యాంక్‌కు తగ్గ ఫామ్‌లో అయితే లేడు.
ఆసియా కప్‌లో బాబర్ 6 ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులు కేవలం 68 మాత్రమే. ఒక మ్యాచ్‌లో గోల్డెన్ డక్ కూడా అయ్యాడు. కానీ.. అతని బ్యాటింగ్ టెక్నిక్ మాత్రం అద్భుతమనే చెప్పాలి. విరాట్ కోహ్లీ తర్వాత అదే రేంజ్‌లో బ్యాటింగ్ చేస్తూ.. తక్కువ టైమ్‌లోనే ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్‌గా మారిన విషయం తెలిసిందే. అలాగే బాబర్ అజమ్‌ను అభిమానించే వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ స్కూల్ పిల్లలకు బాబర్ ఒక ఇన్సిపిరేషన్. పిల్లల్లో బాబర్‌పై ఇష్టాన్ని గమనించిన పాకిస్థాన్ విద్యా శాఖ. ఒక విన్నూత ఆలోచన చేసింది. 9వ తరగతి ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో బాబర్ అజమ్ కవర్ డ్రై టెక్నిక్‌ను పాఠ్యాంశంలో ఒక చోట పెట్టి ఒక ప్రశ్న తయారు చేసింది.
ఆ ప్రశ్న ఏంటంటే.. ‘బాబర్ తన బ్యాట్‌తో బంతికి 150 బౌల్స్‌తో కైనటిక్ ఎనర్జీ అందించి కవర్ డ్రైవ్‌ను కొట్టాడు. (ఎ) బంతి ద్రవ్యరాశి 120 గ్రాములు అయితే బంతి ఎంత వేగంతో బౌండరీకి వెళ్తుంది? (బీ) 450 గ్రాముల ద్రవ్యరాశి కలిగిన ఫుట్‌బాల్‌ను అదే వేగంతో తరలించడానికి ఫుట్‌బాల్ ప్లేయర్ ఎంత కైనటిక్ ఎనర్జీ అందించాలి?’ అనే ప్రశ్నను పాఠ్యపుస్తకంలో పొందుపర్చారు. ప్రస్తుతం పుస్తకంలోని ఈ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధరణంగా క్రికెట్‌ను ఎక్కువగా అభిమానించే దేశంలో ఇలా క్రికెటర్లను ప్రస్తావిస్తూ.. పాఠాలను ఆసక్తి మార్చవచ్చు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా.. బాబర్ అజమ్ ఫామ్‌లో లేకపోయినా.. పిల్లలకు మాత్రం ఉపయోగపడుతున్నాడంటూ కూడా కొంత సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కోహ్లీ అంటేనే ఇష్టం! బాబర్ అజామ్ గాలి తీసేసిన పాకిస్థాన్ కోచ్!
Babar Azam’s cover drive related question in 9th grade physics syllabus (federal board) (via Reddit) pic.twitter.com/I2Tc9HldsG
— Shiraz Hassan (@ShirazHassan) September 13, 2022