శ్రీలంకతో రెండో టీ20లో భారత్ ఓడిపోయి ఉండొచ్చు కానీ అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ని మాత్రం ఫ్యాన్స్ అంత త్వరగా మర్చిపోరు. సూర్యకుమార్-అక్షర్ పటేల్ బ్యాటింగ్ చూసి.. లంక ఆటగాళ్ల ఓ టైంలో భయపడిపోయారు. కానీ సూర్య ఔటైపోవడం, సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో మ్యాచ్ లో మన జట్టు ఓడిపోయింది. అయితే అక్షర్ పటేల్ బ్యాటింగ్, ఫామ్ చూసి.. టీమిండియా ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే టైంలో రవీంద్ర జడేజా గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య పోటీ మంచి రసవత్తరంగా మారనుందా అనే డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి.
ఇక విషయానికొస్తే.. టీమిండియాలో ఆల్ రౌండర్స్ కొరత ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ధోనీ హయంలో స్పిన్ రౌండర్ గా జట్టులోకి వచ్చిన జడేజా.. బ్యాటింగ్, ఫీల్డింగ్ విషయంలో అద్భుతమైన ఫేమ్ సంపాదించాడు. కొన్నాళ్ల ముందు బ్యాటింగ్ లోనూ ఆకట్టుకునే ప్రదర్శనలు చేశాడు. కానీ గతేడాది నుంచి గాయాల బారిన పడుతూ మ్యాచ్ లు ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం జట్టులో కీలక ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యనే.. టీ20 జట్టు కెప్టెన్ గా ఉన్న మనోడు భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ చేయనున్నాడు. సో అతడి వైపు ఎలాంటి ఆలోచన లేదు. కానీ తాజాగా అక్షర్ పటేల్ జట్టులో స్పిన్ ఆల్ రౌండర్ గా సెటిలైపోతున్నాడు.
అటు బ్యాటింగ్, బౌలింగ్ లో ఆకట్టుకుంటున్న అక్షర్ పటేల్.. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అద్భతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ లో 2 వికెట్లు తీసి, బ్యాటింగ్ లో 31 బంతుల్లో 65 పరుగులు చేశాడు. సూర్యకుమార్ తో కలిసి మ్యాచ్ గెలిపించినంత పనిచేశాడు. కానీ చివర్లో సాధించాల్సిన టార్గెట్ ఎక్కువగా ఉండటంతో మ్యాచ్ గెలిపించలేకపోయాడు. కానీ ఆల్ రౌండర్ తన రేంజ్ ని రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ, ఒకవేళ జడేజా మళ్లీ జట్టులో వస్తే పరిస్థితి ఏంటా అని డౌట్ అందరికీ వస్తోంది. అదే టైంలో అక్షర్ పటేల్ ఫామ్ కూడా జడేజాని భయపెడుతోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. రాబోయే కొన్ని నెలల్లో మేజర్ టోర్నీలు జరగనున్నాయి. దీంతో ఆల్ రౌండర్ ప్లేస్ కోసం వీళ్లిద్దరి మధ్య పోటీ తప్పదేమోనని మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై మీ ఓపెనియన్ ఏంటనేది కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
20 ball fifty for Axar Patel, what a fantastic knock under pressure in the run chase. pic.twitter.com/bLMdeZyKdc
— Johns. (@CricCrazyJohns) January 5, 2023