ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచింది. సూపర్ 12లో ఐర్లాండ్ చేతిలో ఓడినా.. తర్వాత పుంజుకుని సెమీస్ చేరిన బట్లర్ సేన.. సెమీస్‌లో పటిష్టమైన టీమిండియాను 10 వికెట్లతో చిత్తుగా ఓడి ఫైనల్ చేరింది. ఇక పాకిస్థాన్‌ను ఫైనల్‌ల్లో ఓడించి.. పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచింది ఇంగ్లండ్. మరోవైపు సూపర్ 12లో వర్షం వల్ల సెమీస్ అవకాశం కోల్పోయి ఆస్ట్రేలియా.. స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక టోర్నీలో సెమీస్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. సెమీస్ చేరకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
ఇక వరల్డ్ కప్ ముగిసిన వెంటనే.. ఛాంపియన్ ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది ఆసీస్. వరల్డ్ కప్ నెగ్గిన జోష్‌లో ఉన్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను కూడా చిత్తు చేస్తుందని సిరీస్‌కు ముందు అంతా భావించారు. అనుకున్నట్లే.. గురువారం జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ.. ఆస్ట్రేలియా టాపార్డర్ చెలరేగి ఆ టార్గెట్‌ను చాలా సింపుల్‌గా ఛేజ్ చేసింది. డేవిడ్ వార్నర్, ట్రెవీస్ హెడ్, స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీలతో రాణించి.. ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో తొలి వన్డేను ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుచుకుంది.
ఇక శనివారం జరిగిన రెండో వన్డేలోనూ ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించాడు. 94 పరుగుల వద్ద అవుటై.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. స్మిత్‌తో పాటు లబుషేన్, మిచెల్ మార్ష్ సైతం హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ను 208 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ చేసింది. స్టార్క్, జంపా చెలరేగి ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇక తొలి మ్యాచ్ ఆడిన బట్లర్ రెండో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ సాధించి మంచి జోరు మీదున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా రెండు వరుస విజయాలతో షాకిచ్చింది.
Australia bags the ODI series against England 🏏#cricket #england #australia #engvsaus pic.twitter.com/xmCyTWQNi3
— Sportskeeda (@Sportskeeda) November 19, 2022
Just Steve Smith thinks 😂🤣#AUSvENG #AUSvsENG#ENGvAUS #ENGvsAUSpic.twitter.com/Zl7vqdqPIY
— Cricket With ABDULLAH (@AbdullahBDFan) November 19, 2022