ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. బ్రిస్బెన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ తర్వాత విధించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి 5.1 ఓవర్లలో చేధించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 147 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో ట్రెవిస్ హెడ్ టీ20 మ్యాచ్‌లలో ఆడినట్లు 148 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 152 పరుగులు చేసి ఆసీస్‌కు భారీ ఆధిక్యాన్ని అందించారు.
How Nathan Lyon joined the 400 club 🙌
(via @FoxCricket) #Ashes pic.twitter.com/fEmMZVQrV0
— ESPNcricinfo (@ESPNcricinfo) December 11, 2021
ఓపెనర్ డేవిడ్ వార్నర్ 94 పరుగులు, లబుషేన్ 74 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా మెదటి ఇన్నింగ్స్‌లో 425 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రూట్(89), మలాన్(82) పరుగులు చేయడంతో 297 పరుగులు చేయగలిగింది. దీంతో ఆసీస్ ముందు 20 పరుగుల లక్ష్యం ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఆసీస్ ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. యాషెస్‌ను ఘనంగా ఆరంభించిన ఆసీస్ ఆటతీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Winning moment 📸#AUSvENG | #WTC23 | #Ashes pic.twitter.com/YIFti1YnOw
— ICC (@ICC) December 11, 2021