గత కొన్ని నెలలుగా ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంది అనే విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది బీసీసీఐ.
గత కొన్ని నెలలుగా ఆసియా కప్ విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ లో అడుగుపెట్టేదే లేదని బీసీసీఐ ఖరాఖండిగా చెప్పేస్తే.. మీరు పాకిస్థాన్ కి రాకపోతే మేము వరల్డ్ కప్ ఇండియాలోకి వచ్చే ప్రసక్తే లేదని పాక్ మొండి పట్టుదలను ప్రదర్శించింది. దీంతో క్రికెట్ లో ఎప్పుడూ లేని హైబ్రిడ్ మోడల్ ని కూడా ప్రవేశపెట్టారు. దీని ప్రకారం భారత్ ఆడబోయే మ్యాచులన్నీ పాక్ లో కాకుండా తటస్థ వేదికలో ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో బీసీసీఐతో పాటు ఇతర జట్లు కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో పాకిస్థాన్ కి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఒకదశలో పాకిస్థాన్ ఆసియా కప్ నుంచి తప్పిస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తప్పిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ తాజాగా ఆసియా కప్ ఎక్కడ జరుగుతుందో ఒక క్లారిటీ ఇచ్చేసారు.
షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 పాకిస్థాన్ లో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు అనేక తర్జన భర్జనలు మధ్య ఇప్పుడు మ్యాచులన్నీ పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిధ్యమివ్వనున్నాయి. ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ దుమాల్ తెలిపారు. ఆసియా కప్ ఆడేందుకు పాకిస్థాన్‌కు ఇండియా వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చేసాడు. డర్బన్ లో జరుగుతున్న ఐసీసీ మీటింగ్ సమావేశంలో డమాల్ పాల్గొన్నారు. బీసీసీఐ కార్యదర్శి అయినటువంటి జే షా, పీసీబీ ప్రతినిధి జాకా అష్రఫ్ కలిసి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపాడు. దీని ప్రకారం పాకిస్థాన్ లో కేవలం నాలుగు మ్యాచులను మాత్రమే నిర్వహించనున్నారు. మిగిలిన 9 మ్యాచులను శ్రీలంకలో నిర్వహించనున్నారు.
ఆసియా కప్ షెడ్యూల్ ని రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. భారత్- పాకిస్థాన్ మ్యాచులు దంబుల్లా వేదికగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్-బి లో బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. ఇక గతేడాది టీ 20 ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్ ని అనూహ్యంగా శ్రీలంక ఎగరేసుకుపోయింది. భారత్ కనీసం ఫైనల్ కి కూడా చేరలేకపోయింది. మొత్తానికి ఆసియా కప్ విషయంలో పాకిస్థాన్ కి నిరాశే ఎదురైంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.