యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ టీమ్ వణికిస్తోంది. టెస్టుల్లోనూ టీ20 తరహాలో ఆడుతూ ఆసీస్‌ను కంగారు పెడుతోంది.
క్రికెట్లో సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టుల్లో ఇన్నాళ్లూ అన్ని టీమ్స్ దాదాపుగా ఒకే తరహాలో ఆడుతూ వచ్చాయి. ప్రతి సెషన్‌కు వ్యూహాలను రచిస్తూ.. ఒక పద్ధతిలో ఆడుతూ వచ్చాయి. టెస్టుల్లో అటాకింగ్ పెద్దగా ఉండదు. కానీ ఇంగ్లండ్ జట్టు మాత్రం ఈ పద్ధతికి చరమగీతం పాడేలాగే ఉంది. బజ్‌బాల్ వ్యూహంతో దూకుడుగా ఆడుతూ టెస్టులకు క్రేజ్ పెంచుతోంది ఇంగ్లీష్ టీమ్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోనూ ఇదే గేమ్ ప్లాన్‌తో ఆడుతోంది. తొలి టెస్టులో ఓడిపోయినా బజ్‌బాల్ వ్యూహాన్ని వదల్లేదు. టెస్టుల్లో టీ20 తరహా గేమ్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తోంది ఇంగ్లండ్. సెకండ్ టెస్ట్‌లో కంగారూ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 416 రన్స్‌కు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ (110), ట్రేవిస్ హెడ్ (77) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
స్మిత్, హెడ్ రాణించడంతో ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. అయితే ఇంగ్లండ్ దూకుడు ముందు ఈ స్కోరు సరిపోయేలా కనిపించడం లేదు. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ టీమ్ బ్యాటర్లు ధనాధన్ షాట్లతో అలరిస్తున్నారు. ఓపెనర్లు జాక్ క్రాలే (48 బంతుల్లో 48), బెన్ డకెట్ (134 బంతుల్లో 98) ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీళ్లిద్దరూ ఫోర్లతో విరుచుకుపడటంతో స్కోరు బోర్డు రాకెట్ వేగాన్ని తలపించింది. ఓలీ పోప్ (42) కూడా క్రీజులో ఉన్నంత సేపు స్పీడుగా ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 4 వికెట్లకు 226. 46 ఓవర్లలోనే ఇంగ్లీష్ టీమ్ ఈ స్కోరును అందుకుంది. స్టార్ బ్యాటర్ జో రూట్ (10 నాటౌట్), బెన్ స్టోక్స్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. టెస్టుల్లోనూ టీ20 తరహా బ్యాటింగ్‌తో ఆ జట్టు బ్యాటర్లు అదరగొడుతున్నారు. ఇంగ్లండ్ జోరు చూస్తుంటే ఆసీస్ స్కోరును మూడో రోజు లంచ్‌లోపే దాటేసేలా ఉంది.