క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ నుంచి క్రేజీ అప్డేట్ రానే వచ్చేసింది. తేదీలు, మ్యాచుల షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనూ కొన్ని మ్యాచులు జరగనుండటం ఫ్యాన్స్ కి తెగ కిక్కిస్తోంది.
మన దేశంలో చాలామంది క్రికెట్ ని అభిమానిస్తారు. ఇంకా చెప్పాలంటే ప్రేమిస్తారు. టీమిండియా మ్యాచ్ జరుగుతుందంటే చాలు.. కుదిరితే స్టేడియానికి వెళ్లిపోతారు. లేదంటే మొబైల్, టీవీల్లో ఒక్క ఓవర్ కూడా మిస్ కాకుండా చూస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. వైజాగ్ లేదంటే హైదరాబాద్ లో మ్యాచ్ అంటే చాలు.. ఎగబడి మరీ టికెట్స్ కొనేస్తారు. మ్యాచుకు మూడు రోజుల ముందు నుంచే హడావుడి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్లకోసమే అన్నట్లు వన్డే వరల్డ్ కప్ తేదీల గురించి అప్డేట్ వచ్చేసింది. మ్యాచులు ఎక్కడెక్కడ జరుగుతాయనే వివరాలు కూడా బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ తర్వాత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే టోర్నీ వన్డే వరల్డ్ కప్. నాలుగేళ్లకు ఓసారి జరిగే ఈ ప్రపంచకప్ టోర్నీకి ఈసారి భారత్ ఆతిథ్యమివ్వనుంది. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. ఓ ఏడాది ముందుగానే ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. కానీ భారత ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల కోసం బీసీసీఐ వేచి చూస్తుండటం వల్లనే ఈసారి ఆలస్యమైనట్లు సమాచారం. ఈ టోర్నీకి పన్ను మినహాయింపు, పాకిస్థాన్ జట్టు వీసా క్లియరెన్స్ లాంటి అంశాలు బీసీసీఐ ముందున్నాయి. గతవారం దుబాయిలో జరిగిన సమావేశంలో.. పాక్ జట్టు వీసాలు క్లియర్ చేసే విషయమై బీసీసీఐ, ఐసీసీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ని ఫిక్స్ చేసినట్లు వినిపిస్తుంది.
భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ అక్టోబరు 5న ప్రారంభమై, నవంబరు 19 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఏకంగా 12 వేదికలను ఖరారు చేసింది బీసీసీఐ. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్ లో వన్డే ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. దీనితో పాటు బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, ధర్మశాల, గౌహతి, కోల్ కతా, లక్నో, ఇండోర్, రాజ్ కోట్, ముంబయిలో కూడా మ్యాచులు జరగనున్నాయి. 46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్ మ్యాచ్ లతో కలిపి మొత్తంగా 48 మ్యాచులు జరగనున్నాయి. హైదరాబాద్ లో లీగ్ మ్యాచుల్ మాత్రమే జరగనున్నట్లు కనిపిస్తుంది. నాకౌట్ మ్యాచులు అహ్మదాబాద్, ముంబయిలో జరిగే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైతేనేం.. హైదరాబాద్ లో మ్యాచులు జరగబోతున్నాయనే న్యూస్ తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది. మరి భాగ్యనగరంలో వన్డే ప్రపంచకప్ మ్యాచులు జరగనుండటంపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
ICC World Cup (Reported by Espncricinfo):
– Starting date: 5th October.
– Final: 19th November.
– Venues: Mumbai, Kolkata, Ahmedabad, Delhi, Bengaluru, Chennai, Dharamsala, Guwahati, Hyderabad, Lucknow, Indore and Rajkot.
– Final’s venue: Ahmedabad.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2023