వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రజాప్రస్థానం పేరిటి పాదయాత్ర చేపట్టారు. అయితే కొన్ని రోజుల క్రితం వరంగల్ నర్సంపేటలో షర్మిల పాదయాత్రపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. మరుసటి రోజు షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించగా.. పోలీసులు ఆమెను కారుతో సహా లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు. షర్మిలపై కేసు నమోదు చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చారు. షర్మిల పాదయత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ.. వైఎస్ షర్మిలకు కాల్ చేసి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ.. మంగళవారం వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఫోన్ చేశారు. తాజాగా నర్సంపేటలో జరిగికన దాడి.. ఆ తర్వాత పోలీసులు ఆమెను కారుతో సహా లిఫ్ట్ చేయడం వంటి పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు. సుమారు 10 నిమిషాల పాటు మోదీ షర్మిలతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని.. సూచించనట్లు సమాచారం. అలానే జరిగిన ఘటనలకు ఆయన సానుభూతి తెలిపారు. ఢిల్లీకి రావాలంటూ మోదీ.. షర్మిలకు సూచించారు. ఇక మోదీ.. షర్మిలకు ఫోన్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.