ఏపీ రాజకీయాల్లో తాడిపత్రి నియోకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ అధికార, ప్రతిపక్షనేతల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాల్ కు ప్రతిసవాల్ నడుస్తున్నాయి. తాజాగా మరోసారి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ సంచలన కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వాడీ వేడీగా ఉంటాయి. రాష్ట్రస్థాయిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇలా రాష్ట్ర స్థాయిలో రాజకీయం రసవత్తరంగా ఉంటే.. వివిధ జిల్లాల్లో కూడా అదే స్థాయిలో సెగలు రేపుతుంది. ఏపీలోని తాడిపత్రి నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ పాము, ముంగిసకు ఉన్న తరహాలు ప్రత్యర్ధుల మధ్య రాజకీయం నడుస్తుంది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తరహాలో సాగుతుంది. ఇప్పటికే అనేక సార్లు ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై నిప్పులు చిమ్మిన జేసీ ప్రభాకర్ రెడ్డి, తాజాగా మరోసారి విరుచక పడ్డారు. ఇదే సమయంలో అక్కడి అధికారులపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారలపై మీడియా సమావేశం నిర్వహించాడు. నకిలీ ఇన్యూరెన్స్ పత్రాల విషయంలో అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారని జేసీ ఫైర్ అయ్యారు. ఇక ఆయన మాట్లాడుతూ..నకిలీ ఇన్సూరెన్స్ లో పెడితే వాహనాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని అధికారులను ప్రశ్నించారు. స్క్రాప్ కింద కొనుగోలు చేసి, వాటికి నకిలీ ఇన్సూరెన్స్ పేపర్లు పెడితే ఎలా అనుమతి ఇచ్చారు? అంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. డీటీసీకి కేసు పెట్టే అధికారం లేదని, ఆయనపై ఒత్తిడి చేసి మరీ కేసులు పెట్టించారని జేసీ ప్రభాకరెడ్డి తెలిపారు.
అధికారులు ఫేక్ డ్యాకుమెంట్లు సృష్టించారని, దమ్ము, ధైర్యం ఉంటే నకిలీ ఇన్సూరెన్స్ లపై కేసులు పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు మరో 11 రకాల పత్రాలు ఉండాలని జేసీ అన్నారు. అలానే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు పెడితే వాహనాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అధికారులందరూ కేసుల్లో ఇరుక్కుంటారని జేసీ అన్నారు. అలానే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ఓ రేంజ్ విరుచపడ్డారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఓ పిచ్చోడని, ఆయన ఇంట్లో పిచ్చోళ్లే ఉన్నారని, ఆయన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని జేసీ ప్రశ్నించారు.
అలానే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై సెటైర్లు వేశారు. బైక్ రేసులు, గుర్రం పందెలు, గుడ్ మార్నింగ్ ధర్మవరం చేసుకో అంటూ కేతిరెడ్డిపై సెటైర్లు వేశారు. అధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవ్వడం ఇదేమి కొత్త కాదు. ఇప్పటికే డీఎస్పీ చైతన్యపై, ఇతర అధికారులపై ఇప్పటికే అనేక సార్లు జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఇలా నిత్యం సవాల్, ప్రతిసవాల్ నడుస్తూనే ఉన్నాయి. తాడిపత్రి రాజకీయలు ఎప్పుడు చల్లారుతాయా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి..తాజాగా అధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.