ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం పల్స్ సడెన్ గా పడిపోగా.. కుటుంబ సభ్యలు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలో మరణించారు. రోశయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. రోశయ్య సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆర్థిక అపర చాణక్యుడిగా రోశయ్య తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువ సార్లు ఆర్థిక మంత్రిగా రోశయ్య పనిచేశారు. శాసనసభలో వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రోశయ్య రికార్డు సాధించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పడంలో రోశయ్య స్టైలేవేరు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్యది. రోశయ్య తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.