ఓటీటీ లవర్స్ ఎంత వద్దన్నా సరే ఏ వారానికి ఆ వారం సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత ప్రతి వారం తక్కువలో తక్కువ 15-20 సినిమాలకు పైనే ప్రతి వారం ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఏకంగా 20 వరకు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మూవీస్, వెబ్ సిరీసులు, టాక్ షోలు.. ఇలా ఒకటేమిటి ఆడియెన్స్ కి బొనాంజా అన్నంతగా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ వారంలో కొన్ని సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్.. మరికొన్ని క్రేజీ మూవీస్ విడుదలకు సిద్ధమైపోయాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు ఓటీటీలు అంటే కేవలం సినిమాలు మాత్రమే ఎక్కువగా చూస్తారని అనుకునేవారు. కానీ దాన్ని బ్రేక్ చేసిన టాక్ షో ‘అన్ స్టాపబుల్’. 2021-22లో తొలి సీజన్ సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం రెండో సీజన్ చివరకు వచ్చేసింది. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ రెండో పార్ట్ తో ఈ సీజన్ కు ఎండ్ కార్డ్ వేయనున్నారు. సరిగ్గా ఈ షో పూర్తయిన రోజే.. ‘నిజం విత్ స్మిత’ అని సోనీ లివ్ లో మరో టాక్ షో స్టార్ట్ కానుంది. వీటితో పాటు ‘హంట్’, ‘వేద’ చిత్రాలతో పాటు ‘ఫర్జీ’ సిరీస్ ఆడియెన్స్ లో ఆత్రుత పెంచుతోంది. మరి వీటిలో మీరు దేన్ని చూసేందుకు రెడీ అవుతున్నారు.