గత కొన్నిరోజులుగా థియేటర్లలో, సోషల్ మీడియాలో ‘అవతార్ 2’ మేనియానే నడిచింది. మరికొన్ని రోజుల పాటు నడవనుంది కూడా. అందుకు తగ్గట్లే గత వారం ఓటీటీలోనూ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ ఏం రాలేదు. ఈసారి మాత్రం మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు 20కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు రెడీ అయిపోయాయి. అందుకు సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది. ఇక ఈ వీకెండ్ కి మూవీస్ చూసే ప్రోగ్రామ్ పెట్టుకున్న వాళ్లు.. ఆల్రెడీ ఏయే సినిమాలు ఎప్పుడు చూడాలి అనేది ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు చూసే పద్ధతే మారిపోయింది. థియేటర్లకు వెళ్లి చూసేవారు ఎలానూ బిగ్ స్క్రీన్ పై మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అదే టైంలో ఓటీటీలోనూ కొత్త సినిమాలు ఏమేం వస్తున్నాయి. వాటిని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గట్లే సదరు ఓటీటీ సంస్థలు కూడా కొత్త సినిమాలని ప్రతివారం రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇక ఈ వారం కూడా ఏకంగా 21 సినిమాలు/వెబ్ సిరీసులు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఇంతకీ అవేంటి? ఏయే తేదీల్లో స్ట్రీమింగ్ కానున్నాయో ఓసారి చూసేద్దాం.
Here’s the list of this week’s OTT releases! pic.twitter.com/jgjGzNmurM
— SumanTV (@SumanTvOfficial) December 19, 2022