కరోనా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ దాదాపు కోలుకుందనే చెప్పాలి. బిగ్ స్టార్స్ తో పాటు యంగ్ హీరోలు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటు వాతావరణం ముసురు, చల్లగాలులతో ఆహ్లాదంగా మారింది. అటు పలు సినిమాలు థియేటర్/ ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న థియేటర్, ఓటీటీ చిత్రాల వివరాలు. రిలీజ్ డేట్స్ గురించి చూద్దాం.
థియేటర్‌లో విడుదల అయ్యే చిత్రాలు:
ది వారియర్:
రామ్ పోతినేని కెరీర్ లో తొలిసారి పోలీస్ గెటప్ లో నటించిన ఈ చిత్రం జులై 14న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించగా.. డీఎస్పీ మ్యూజిక్ అందించాడు.
గార్గి:
సాయి పల్లవి తనదైనశైలిలో విభిన్న పాత్రలతో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవలే విరాట పర్వంతో మంచి హిట్ అందుకున్న సాయి పల్లలి.. గార్గిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
డ్రాగన్ గర్ల్:
ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమాగా రామ్ గోపాల్ వర్మ చెబుతున్న లడ్కీ.. డ్రాగన్ గర్ల్ మూవీ జులై 15న విడుదల కానుంది. ఈ సినిమా చైనాలో 40 వేల కంటే ఎక్కువ స్క్రీన్స్ లో విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ మూవీలో పూజా భలేకర్, అభిమన్యు సింగ్, మియా ప్రధాన పాత్రల్లో నటించారు.
మై డియర్ భూతం:
ప్రభుదేవా ఓ సరికొత్త పాత్రలో సందడి చేయనున్నాడు. అల్లాఉద్దీన్ అద్భుత దీపం వంటి సినిమాల్లో కనిపించే జీనీ భూతంలా.. మై డియర్ భూతం సినిమాలో ప్రభుదేవా కనిపించనున్నాడు. ఓ పిల్లాడికి జీనీకి మధ్య ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీ జులై 15న థియేటర్లలో విడుదల కానుంది.
హిట్ ఫస్ట్ కేస్:
తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా 2020లో విడుదలైన హిట్ సినిమాని హిందిలో రీమేక్ చేశారు. అక్కడ కూడా హిట్ ఫస్ట్ కేస్ అనే టైటిల్ పెట్టారు. ఆ మూవీలో రాజ్ కుమార్ రావు, సాన్య మల్హోత్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 15న థియేటర్లలో విడుదల కానుంది.
ఆహా:
జీ5:
అమెజాన్ ప్రైమ్:
నెట్ ఫ్లిక్స్:
డిస్నీ+ హాట్ స్టార్:
ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లలో మీకు నచ్చిన, మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.