ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే మారిపోయింది. ప్రధానంగా యూట్యూబ్ లాంటి వీడియో బేస్డ్ మీడియా చాలా మంది జీవితాలను మార్చేసింది. యూట్యూబ్ ఛానల్స్ ద్వార చాలా మంది పాపులర్ అయ్యారు. అంతే కాదు యూట్యూబ్ ఛానల్ వల్ల క్రేజ్ సంపాదించి, ఆ తరువాత సినిమాల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వారిలో ఎంతో మందికి సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ఈ సందర్బంగా ప్రధానంగా గంగవ్వ గురించి చెప్పుకోవాలి. ఎక్కడో మాముమూల గ్రామంలో వ్యవసాయం చేసుకుని బ్రతికే గంగవ్వ మై విలేజ్ షో ద్వార బాగా పాపులర్ అయ్యింది. ఆ తరువాత బిగ్ బాస్ లో హంగామా చేసింది. ఇక వెనక్కి తిరిగిచూసుకోకుండా సినిమాల్లో కూడా నటిస్తోంది గంగవ్వ.
మై విలేజ్ షో ద్వార పాపులర్ అయిన వారిలో అనిల్ కూడా ఉన్నాడు. మై విలేజ్ షో సక్సెస్ తర్వాత అనిల్ సొంతంగా ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యాడు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ చాలా బిజీ గా మారిపోయాడు. తాజాగా అనిల్ నటించిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం ప్రమోషన్ ఇంటర్వూలో పాల్గొన్న అనిల్ పలు విషయాలను పంచుకున్నాడు.
గంగవ్వ కి నాగార్జున ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు కదా, ఆ ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయని యాంకర్ అడగ్గా అనిల్ కాస్త చిరాకు పడ్డాడు. గంగవ్వ ఇంటి గురించి ముందు చెప్పడానికి సందేహించిన అనిల్, మా సినిమా గురించిన ప్రశ్నలు అడగకుండా గంగవ్వ గురించి అడుగుతున్నారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఆ తరువాత కాస్త సర్దుకుని.. గంగవ్వ ఇల్లు మరో నెలలో పూర్తవుతుందని చెప్పాడు అనిల్. ఆ తరువాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా గురించిన విషయాలను చెప్పుకొచ్చాడు.