ఎన్నో కంపెనీలు దేశ, ప్రపంచంలోని కష్టనష్టాలను చూసి సహృదయంతో ఎన్నో మిలియన్ల డాలర్లను దానం చేసాయి. స్వార్జితమే అయినా కరువు పరిస్థితులను, కరోనా స్థితిగతులను అర్ధం చేసుకుని తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి. అయితే., గడిచిన 100 ఏళ్లలో అత్యధికంగా దానం చేసిన ఘనత మన భారతీయుడి కే దక్కింది. అతను భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ను స్థాపించాడు. ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధిక దానం చేసి సేవా కార్యక్రమాలకు నగదు ఖర్చు చేసిన వ్యక్తి మన భారతీయుడే. ఆయనెవరో కాదు మన భారతీయ మార్గదర్శక పారిశ్రామికవేత్త జెంషెట్జీ టాటా. టాటా గ్రూప్ ని స్ధాపించింది ఆయనే.
పారిశ్రామిక ప్రపంచంలో జెంషెట్జీ ఎంత ప్రభావం చూపించాడంటే, భారత దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ టాటాను వన్ మ్యాన్ ప్లానింగ్ కమిషన్ గా అభివర్ణించాడు. టాటా గ్రూపు మొదలైన ఏడాది నుంచి ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. గడిచిన వంద సంవత్సరాలలో మొత్తం టాటా గ్రూప్ నుంచి ఈ నగదు అందించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెంషెట్ జీ టాటా 102 బిలియన్ డాలర్లను సేవాకార్యక్రమాలకు వినియోగించారట. ఇప్పటి వరకూ ఎవరూ ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించలేదు.
టాటా 1870 లలో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్ వీవింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని ప్రారంభించారు. టాటా సాధించిన అనేక విజయాలలో జంషెడ్‌పూర్‌లోని టాటా ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ సంస్థ ప్రసిద్ది చెందింది. ఆసియాలో మొదటి, భారతదేశపు అతిపెద్ద స్టీల్ కంపెనీ. కోరస్ గ్రూప్ సంవత్సరానికి 28 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్న తరువాత ఇది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద స్టీల్ కంపెనీగా అవతరించింది.
టాటా ట్రస్ట్ల ద్వారా సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకూ ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.