సాధారణంగా ఎవరైనా ఆపదలో ఉంటే మనకు ఎందుకు వచ్చిన గొడవ అనుకొని వెళ్లేవారు దేశంలో ఎంతో మంది ఉన్నారు.. అతి కొద్ది మంది మాత్రమే అయ్యో పాపం అని ఆపదలో ఉన్నవారిని రక్షిస్తుంటారు. ఇక మూగజీవాల పరిస్థితి మరీ దారుణం.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ చనిపోతుంటాయి.
ఈ మద్య కొంతమంది రోడ్డుపై ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే మాకెందుకు అనే ఉద్దేశ్యంతో పక్కకు తొలగి వెళ్లిపోతున్నారు.. మరికొంత మంది ఆపదలో కొట్టుమిట్టాడే వ్యక్తిని ఫోటోలు తీయడం.. సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఎవరో మంచి మనసు ఉన్నవాళ్లు ఆపదలో ఉన్నవారిని రక్షిస్తున్నారు.. లేదా 108 కి ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు. ఇక మూగజీవాల పరిస్తితికి వస్తే అంతే సంగతులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పక్షులు, జంతువులు నిర్ధాక్షిణ్యంగా వదిలివేస్తుంటారు. కానీ ఓ కుర్రాడు ఆపదలో చిక్కుకున్న ఓ కాకిని రక్షించి దానికి ప్రాణదానం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆపదలో చిక్కుకున్న మూగజీవాలను రక్షించాలంటే మంచి మనసు ఉండాలి.. కొన్నిసార్లు వాటి వల్ల ప్రమాదం అని తెలిసినా కూడా వాటిని రక్షించేందు ధైర్యం చేసి ముందుకు వెళ్తారు. ఓ స్కూల్ పరిధిలో గోడపై వేసిన వలలో ఓ కాకి చిక్కకుంది. కావ్ కావ్ అంటూ అరవడంతో అటుగా వెళ్తున్న స్కూల్ కుర్రాడు దాన్ని గమచించి కాకి వద్దకు వెళ్లాడు. మిగతా స్కూల్ పిల్లలు కాకి కరుస్తుంది.. వద్దు అని వారిస్తున్నా వినలేదు. కాకి కి చిక్కుకున్న వలను సురక్షితంగా తొలగించి బయటకు తీసి గాల్లోకి విసిరాడు. దాంతో పక్కన ఉన్న స్కూల్ పిల్లల ముఖంలో ఎంతో ఆనందం.. సంతోషం కనిపించింది.
ఈ దృశ్యాలను అక్కడే ఓ స్కూల్ టీచర్ తన సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాకపోతే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేదు. ఈ వీడియోపై ఎంతోమంది స్పందించారు.. రెండు రోజుల్లోనే 84 వేల మందికి పైగా షేర్ చేయగా.. 2400 మంది వీడియోని లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూగజీవిని రక్షించాలన్న ఆ బాలుడిని మనసు ఎంతో గొప్పదని ఓ యూజర్ అంటే.. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి.. మంచి మనసుతో మూగజీవాలను రక్షించి వాటి ప్రాణం పోయాలని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఇంత మంచి మనసు ఉన్న ఈ స్కూల్ పిల్లాడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మరో కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మూగ జీవిని రక్షించి ప్రాణాలు కాపాడిన ఈ బాలుడి మంచితనం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A compassionate heart touches countless lives.❤️🌸 pic.twitter.com/93XKNckU0n
— Sabita Chanda (@itsmesabita) March 1, 2023