రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదర్కొంటున్న వనమా రాఘవేంద్రకు భారీ షాక్ తగిలింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాఘవపై వస్తున్న ఆరోపణలో నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమ్మల్లోకి వచ్చినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసులో మలుపు.. సూసైడ్ నోట్ లో ఎమ్మెల్యే కొడుకు
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచచు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమా రాఘవేంద్ర రావుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వనమా తనను ఎలా ఇబ్బంది పెట్టాడో వివరిస్తూ.. రామకృష్ణ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో.. సంచలనం సృష్టించిన సంగతి తెలసిందే. ఈ క్రమంలో వనమాపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : ఎమ్మెల్యే కుమారుడు.. వివాదాల రాఘవుడు