నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వలన రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎందరో అమయాకులు బలైపోతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభంవించింది. 45 మంది విద్యార్ధులతో విహారయాత్ర వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో దాదాపు 16 మంది మరణిచింనట్లు సమాచారం. ఈ ఘటనపై కులు పట్టణ డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం..
విహారయాత్రలో భాగంగా పాఠశాల విద్యార్థులతో సయంజ్ కు వెళ్తున్న బస్సు ఉదయం 8.30 గంటలకు జంగ్లా గ్రామం వద్ద అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో మొత్తం 16 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కు మంది విద్యార్థులు, కొందరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో 12 మందికిపైగా విద్యార్థులు మరణించారు. జిల్లా అధికారులు, రెస్క్యూ టీములు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.