ఆడ పిల్లకు ఇంటి గడపలోనూ కాదూ బయట కూడా స్వేచ్చగా బతికేందుకు అవకాశానివ్వడం లేదు మగవాళ్ల రూపంలో ఉన్న మృగాళ్లు. తెలిసిన వ్యక్తుల చేతుల్లోనే కాదూ ముక్కు, మోహం తెలియని మగాళ్ల చేతుల్లోనూ బలౌతుంది.
ఆడ పిల్లకు ఇంటి గడపలోనూ కాదూ బయట కూడా స్వేచ్ఛగా బతికేందుకు అవకాశానివ్వడం లేదు మగవాళ్ల రూపంలో ఉన్న మృగాళ్లు. తెలిసిన వ్యక్తుల చేతుల్లోనే కాదూ ముక్కు, మోహం తెలియని మగాళ్ల చేతుల్లోనూ బలౌతుంది. ఇక తాగేసి రోడ్లపై తిరిగే మందు బాబులు గురించి చెప్పనక్కర్లేదు. ఎక్కడ ఆడది ఒంటరిగా కనిపిస్తే.. అక్కడికి వెళ్లి తమ వెకిలీ చేష్టలు చేస్తుంటారు. అమ్మాయి అంటే కామ వాంఛను మాత్రమే తీర్చే బొమ్మగా భావిస్తాడో ఏమో.. ఆమె శరీరానికి రేటు కడుతుంటాడు. నడి రోడ్డుపై మహిళలు చీరలు లాగడం, ఆమె ఒంటిపై చేయి వేయడం, బలత్కారం చేయడం, హతమార్చడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎన్ని చట్టాలు చేసినా.. వారి ఆగడాలకు అడ్డుకట్ట మాత్రం పడటం లేదు.
తాజాగా హైదరాబాద్‍లో ఓ యువతి పట్ల దారుణంగా వ్యవహరించాడో తాగుబోతు. నడి రోడ్డుపై ఆమె దుస్తులు చింపి పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాజీ నగర్ బస్టాండ్ వద్ద ఓ యువతి నడిచి వెళుతుండగా.. పెద్ద మారయ్య అనే ఓ కూలి మద్యం మత్తులో ఆమె పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. ఆమె దుస్తులు విప్పి, వివస్త్రను చేసి క్రూరంగా ప్రవర్తించాడు. అడ్డొచ్చిన మరో మహిళపై దాడి చేయబోయాడు. 15 నిమిషాల పాటు యువతి రోడ్డుపై నగ్నంగా ఉన్న పట్టించుకోలేదు సరికదా.. చోద్యం చూస్తున్నట్లు చూస్తుండిపోయారు అక్కడి జనం. మారయ్య అక్కడ నుండి వెళ్లాక.. అప్పుడు కొంత మంది మహిళలు కవర్లు కప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడ్ని అరెస్టు చేశారు.