సినిమా షూటింగ్ అంటే బయటకి కనిపించేంత సులభం కాదు. ఇక్కడ ఏ క్షణం ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అస్సలు ఊహించలేము. ఇందుకే షూటింగ్ స్పాట్ లో ప్రమాదాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా తమిళ చిత్ర సీమలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ విరాల్లోకి వెళ్తే..
ప్రముఖ దర్శకుడు, నటుడు చేరన్ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ స్పాట్ లో చేరన్ టైమింగ్ మిస్ అయిపోయి.., మొదటి అంతస్థు నుండి కింద పడిపోయారు. దీంతో.., ఆయన తలకి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆయన తలకి మొత్తం 8 కుట్లు పడ్డాయట. చేరన్ తెలుగు వారికి కూడా సుపరచితులే.
తెలుగులో రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీని.. తమిళంలో తెరకెక్కించింది చేరనే. పైగా.., ఆ సినిమాకి ఈయనే దర్శకుడు కూడా. ఈ మూవీకి గాను చేరన్ జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఇలాంటి సీనియర్ ఆర్టిస్ట్, డైరెక్టర్ కి సెట్ లో ప్రమాదం జరగడంతో అంతా షాక్ కి గురి అవుతున్నారు. చేరన్ ఈ ప్రమాదం నుండి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి.