మే 31 నుంచి కొన్ని గ్రహాల రాశిచక్రాలు మారబోతున్నాయి. అలానే ఈ గ్రహాలు, రాశుల మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల మీద రాశుల మీద కనిపిస్తుంది.
మే 31 నుంచి కొన్ని గ్రహాల రాశిచక్రాలు మారబోతున్నాయి. అలానే ఈ గ్రహాలు, రాశుల మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల మీద రాశుల మీద కనిపిస్తుంది. మే 31 నుంచి ఏ రాశుల వారికి శుభవార్త లభిస్తుందో తెలుసుకోండి. ఈ రాశుల వారికి మే 31 నుంచి అదృష్టానికి పూర్తి మద్దతు లభించి వద్దన్న డబ్బు వస్తునే ఉంటుంది. 31 మే 2023 నుంచి ఏ రాశుల వారికి ఫలప్రదంగా ఉండబోతోందో తెలుసుకుందాం.
ఈసారి శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు, మేషం, కర్కాటకం, వృశ్చికం, మీనం రాశుల వారికి అదృష్టం జూలై 3 వరకు చాలా శుభప్రదంగా ఉండబోతోందని ప్రముఖ బైద్యనాథం జ్యోతిష్యుడు పండిట్ నంద్ కిషోర్ ముద్గల్ తెలిపారు. ఈ నెల 31న శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీని వల్ల మేషం, కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్టయోగం పట్టబోతుంది. పండిట్ నంద్ కిషోర్ ముద్గల్ తెలిపిన ప్రకారం..జాతకంలో శుక్రుడి స్థానం శుభప్రదంగా ఉంటే జీవితంలో మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు.
శుక్రుడు ధనం, కీర్తికి అధిపతిగా పరిగణించబడ్డాడు. అందుకే శుక్రుడు ఏ రాశిలో శుభం కలిగి ఉంటాడో ఆ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరోవైపు శుక్రుడు కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తున్న ఈ సారి మేషం, కర్కాటకం, వృశ్చికం, మీనం అనే నాలుగు రాశుల అదృష్టం జూలై 3 వరకు చాలా శుభప్రదంగా ఉండబోతోంది. కర్కాటక రాశిలో శుక్రుని సంచారం మే 31, 2023 ఉదయం 3.45 గంటలకు జరుగుతుదని ఆయన తెలిపారు. శుక్రుడు, బుధుడు రాశిచక్రం మిథునం నుండి బయటకు వెళ్లి చంద్రునికి చెందిన కర్కాటక రాశిలోకి ప్రవేశించి..జూలై 3 వరకు అక్కడే ఉంటాడు.
ఇదే సమయంలో మేష రాశి వారి కుటుంబంలో శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు కాబట్టి మీరు ప్రియమైనవారితో బలమైన బంధాన్ని అనుభవించవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు కూడా అందుతాయి. కర్కాటక రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి సంపదను కలుగుతుంది. అంతేకాక కర్కాటక రాశి వారు ఆనందంగా ఉంటారు. వారు చేసే పనుల్లో విజయావకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు.
ఈ రాశి వారు వాహనం కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ సమయం. ఇక మే 31 నుంచి అదృష్టయోగం కలిగిన రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి. ఈ రాశివారికి డబ్బు సృష్టించబడుతుంది. మరోవైపు వృశ్చిక రాశి వారికి పూర్వీకుల ఆస్తి చేకూరుతుంది. కుటుంబంతో సయోధ్య పెరిగి.. బంధం బలపడుతుంది. మీన రాశివారికి కూడా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. ఈ రాశి వారు కొత్త ఇళ్లను కొనుగోలు చేస్తారు. ఈ రాశివారి ధన లాభం చేకూరుతుంది. ఇక్కడ ఇచ్చిన సమాచారం.. కేవలం నమ్మకాలపై ఆధారపడినవి మాత్రమే.