జ్యోతిష్య శాస్త్రంలో త్రిగ్రహ యోగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. త్రిగ్రహ యోగం అంటే ఒక రాశిలో మూడు గ్రహాలు కలవడంగా చెబుతారు. అయితే ఇప్పుడు మకర రాశిలో శని, శుక్ర, బుధ గ్రహాలు కలవడంతో అరుదైన త్రిగ్రహ యోగం ఏర్పడింది. డిసెంబరు 28న బుధుడు మకరరాశిలోకి ప్రవేశించాడు. డిసెంబరు 29న శుక్రుడు కూడా మకరరాశిలోకి ప్రవేశించడం జరిగింది. అప్పటికే శని మకరరాశిలో ఉన్నాడు. ఇలా ఈ మూడు గ్రహాలు మకరరాశిలో ఉండటం వల్ల 4 రాశుల వారికి బాగా కలిసొస్తుందని చెబుతున్నారు. మరి.. ఆ 4 రాశుల వారు ఎవరు? వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..
ఈ మకర రాశిలో ఏర్పడిన త్రిగ్రహ యోగం వల్ల మేష రాశి వారికి చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఉద్యోగాలు చేసే వారికి కెరీర్‌లో మంచి గ్రోత్ ఉంటుందట. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇంతకన్నా మంచి సమయం దొరకదట. ఈ మేషరాశి వారికి పూర్వీకుల ఆస్తి వల్ల కూడా ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయ వనరులు పెరగడం వల్ల ఆర్థికంగా మేషరాశి వాళ్లు నిలదొక్కుకోగలుగుతారు. పెట్టుబడి పెట్టడానికి కూడా ఇదే మంచి సమయంగా చెబుతున్నారు.
త్రిగ్రహ యోగంలో శని ఉండటం వల్ల మీనరాశి వారికి బాగా కలిసొస్తుందని చెబుతున్నారు. మీనరాశి వారికి ఉద్యోగం, వ్యాపార, వృత్తి పరంగా బాగా కలిసొస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే ఎప్పటినుంచో మీరు తీర్చలేకపోతున్న రుణాల నుంచి విముక్తి పొందుతారట. మానసిక, ఆరోగ్య, దాంపత్య జీవితం కూడా సుఖసంతోషాలతో సాగించగలుగుతారు.
ఈ యోగం వల్ల మకరరాశి వారికి ఎంతో మేలు జరిగే సూచనలు ఉన్నాయి. వీరికి అనుకోని అదృష్టం కలిసి రావడం, ఆకస్మిక ధనలాభం జరుగుతాయని చెబుతున్నారు. ఉద్యోగ విషయంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మీకు ఇంక్రిమెంట్ పడే సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితం విషయంలో కూడా మీకు బాగా కలిసొస్తుందని చెబుతున్నారు.
ఈ మకరరాశి త్రిగ్రహ యోగం వల్ల మిధున రాశి వారికి ధనలాభం ఉంది. గతంలో కంటే మీరు ఆర్థికంగా వృద్ధి చెందుతారట. పదోన్నతితో పాటు కోరుకున్న చోటుకి బదిలీ పొందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వృత్తి, వ్యాపారం పరంగా కూడా మిధున రాశి వారికి ఈ త్రిగ్రహ యోగం మేలు చేస్తుందని చెబుతున్నారు.